New PF Rules: మీ ఆదాయంపైనే కాదు..పొదుపుపై కూడా పన్ను చెల్లించాలి. 2021-22 ఆర్ధిక బడ్జెట్‌లో ప్రొవిడెంట్ ఫండ్‌పై మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేశారు. ఆ ప్రకటన ఫలితమే ఇది. అదేంటో చూద్దాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏప్రిల్ 1 నుంచి సరికొత్త నిబంధనలు ( New pf rules) అమల్లో రానున్నాయి. మీ నెలసరి జీతంపైనే కాకుండా జీతంలో ప్రతి నెలా కట్ అయ్యే పీఎఫ్‌పై కూడా ఇక పన్ను కట్టాల్సిందే. కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ( Nirmala sitaraman) 2021-22 ఆర్ధిక బడ్జెట్ ( Union Budget) సమర్పించే సమయంలో ప్రోవిడెంట్ ఫండ్‌పై కీలక ప్రకటన చేశారు. దీని ప్రకారం ప్రోవిడెంట్ ఫండ్ ఏడాదికి 2.5 లక్షలకు పైన జమయ్యే నగదుపై లభించే వడ్డీపై ఇక ఇన్‌కంటాక్స్ కట్టాల్సిందే. ఏడాదికి 2.5 లక్షలలోపు డిపాజిటయ్యే మొత్తంపై వడ్డీకు ఎలాంటి పన్ను అవసరం లేదు. 


ప్రతి ఉద్యోగి పీఎఫ్ ఖాతా ( Pf Account) లో ఉద్యోగి మూల వేతనం నుంచి 12 శాతం జమ అయితే..అదే మొత్తానికి సమానమైన మొత్తం కంపెనీ ఆ ఉద్యోగి పీఎఫ్ ఖాతాకు జమ చేస్తుంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో పీఎఫ్ ఖాతాలో ఎక్కువ నగదు జమ చేసేవారికి ప్రతికూల ప్రభావం ఎదురుకానుంది. అంటే ఏడాదికి 20.83 లక్షలకు పైన సంపాదించేవారు పీఎఫ్ కాంట్రిబ్యూషన్‌పై ట్యాక్స్ చెల్లించుకోవల్సి వస్తుంది. ఈ కొత్త నిబంధన ఉద్యోగి వాటాకు మాత్రమే వర్తిస్తుంది. మోదీ ప్రభుత్వం ( Modi government) ప్రవేశపెట్టిన కొత్త నిబంధన ఏప్రిల్ 1 నుంచి అమల్లో రానుంది. ఇప్పటివరకూ పీఎఫ్ అమౌంట్ ద్వారా లభించే వడ్డీపై ఎలాంటి పన్ను లేదు. అయితే ఆ పన్ను ఎంత విధిస్తారనేది ఇంకా స్పష్టత రాలేదు. దీనికి సంబంధించిన నియమ నిబంధనలు ఖరారు కాలేదింకా. అంటే ఇక శాలరీపైనే కాకుండా  పీఎఫ్ కాంట్రిబ్యూషన్‌పై కూడా పన్ను చెల్లించాలన్న మాట.


Also read: Changes From 1 March: ఎస్బీఐ, FASTag సహా ఈ అంశాలు మార్చి 1 నుంచి మారుతున్నాయి


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook