ఇప్పటికే వివిధ రంగుల్లో వచ్చిన రూ.2000, రూ.500, రూ.200, రూ.50 నోట్ల జాబితాలో ఇప్పుడు రూ.10 నోట్లు కూడా చేరిపోయింది. త్వరలో రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా రూ.10 నోటును చాక్లెట్ రంగులోకి మార్చాలని యోచిస్తోంది. ఈ నోట్లపై గాంధీ ముఖచిత్రంతో పాటు ఒడిశా కోణార్క్ సూర్యదేవాలయం బొమ్మను అచ్చువేయనుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రూ.10 రూపాయల నోటును మార్చాలని గతవారమే ఆర్బీఐ నిర్ణయించింది. రూ.10 రూపాయల నోటును 2015లో మొదటిసారి రూపకల్పన చేశారు. ఆ తరువాత డిజైన్ మార్చడం ఇదే తొలిసారి.  2017లో ఆర్బీఐ కొత్త రూ.200, రూ.50 నోట్లను బ్యాంకుల ద్వారా అందుబాటులోకి తెచ్చింది.


ఏటీఎంలలో రూ. 200



 


ఇప్పటివరకు బ్యాంకుల్లో అందుబాటులో ఉన్న రూ.200 నోట్లను త్వరలోనే ఏటీఎం ద్వారా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని రిజర్వు బ్యాంక్ తెలిపింది. చిల్లర సమస్యలతో ఇబ్బందిపడుతున్న ప్రజల కష్టాలను తీర్చేందుకు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించిందని బ్యాంకు ఉన్నతాధికారులు తెలిపారు. ఆర్బీఐ ఆదేశాలతో బ్యాంకులు కూడా అందుకు ఏర్పాట్లను ప్రారంభించాయట. మరో ఐదారుమాసాల్లో ఏటీఎంలలో రూ. 200 నోట్లు అందుబాటులోకి వస్తాయని చెప్పారు.