LPG Gas: గ్యాస్ సిలిండర్ బుక్ చేస్తున్నారా ? ఈ కొత్త రూల్ గురించి తెలుసుకోండి!
Gas Delivery Rules: గ్యాస్ వినియోగదారులు ఇకపై ఓటీపి ( OTP ) ఉంటేనే గ్యాస్ సిలిండర్ ను పొందగలరు.
LPG Gas: గ్యాస్ వినియోగదారులు ఇకపై ఓటీపి ( OTP ) ఉంటేనే గ్యాస్ సిలిండర్ ను పొందగలరు. ఆయిల్ కంపెనీలు కొత్తగా డెలివరీ ఆథెన్టికేషన్ కోడ్ ( DAC ) అనే విధానాన్ని ప్రామాణికంగా పెట్టనున్నాయి అని సమాచారం. నవంబర్ 2020 నుంచి ఈ విధానం అమలులోకి రానుంది అని సమాచారం.
READ ALSO: Amazon, Flipkart భారీ సేల్, అద్భుతమైన ఆఫర్లు, మరెన్నో
ఈ డిలవరీ ప్రాసెస్ చాలా సరళంగా ఉంటుంది. ఎవరైనా గ్యాస్ సిలిండర్ ( LGP Gas ) బుక్ చేస్తే వారి రిజిస్టర్ మొబైల్ కోడ్ వస్తుంది. డిలవరీ సమయంలో ఈ కోడ్ చూపించాల్సి ఉంటుంది. దీని వల్ల గ్యాస్ సిలిండర్ కరెక్ట్ వ్యక్తికే చేరింది అనేది నిర్ధారణ జరుగుతుంది.
కొత్త సిస్టమ్ గురించి మీరు తెలుసుకోవాల్సిన విషయాలివే
డిలవరీ ఆథెన్టికేషన్ కోడ్ ( DAC ) ను ముందు 100 స్మార్ట్ నగరాల్లో పరిచయం చేయనున్నారు. ప్రస్తుతం జైపూర్, రాజస్థాన్ లో పైలెట్ ప్రాజెక్ట్ నిర్వహిస్తున్నారు.
ఈ 100 నగరాల తరువాత ఇతర నగరాలకు విస్తరించనున్నారు.
READ ALSO: Navratri 2020: అమ్మవారికి ఏ రోజు ఎలాంటి పూజలు జరగాలి ? ఘటస్తాపన ముహూర్తాలు ఏంటి ?
కమర్షియల్ సిలిండర్లకు ఈ సిస్టమ్ వర్తించదు.
గ్యాస్ బుక్ చేసిన వెంటనే రిజిస్టర్ నెంబర్ పై ఒక కోడ్ వస్తుంది. దాన్ని చూపిస్తే గ్యాస్ సిలిండర్ ఇస్తారు.
కస్టమర్ మొబైల్ నెంబర్ అప్డేట్ అయితే డిలవరీ చేసే వ్యక్తి రియల్ టైమ్ లో కోడ్ జెనరేట్ చేయగలడు.
తప్పుడు చిరునామా, వివరాలతో గ్యాస్ పొందడానికి ప్రయత్నించే వారికి చెక్ పెట్టడానికి ఇలా కొత్త విధానం తీసుకొచ్చారు.
A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే ZEEHINDUSTAN App డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
IOS Link - https://apple.co/3loQYeR