NGT: ఎన్జీటీ(జాతీయ హరిత ట్రైబ్యునల్)లో తెలంగాణ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగినట్లు అయ్యింది. వ్యర్థాల నిర్వహణలో మార్గదర్శకాలు, తీర్పులు అమలు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. రూ.3 వేల 800 కోట్ల జరిమానాను విధించింది. రెండు నెలల్లో మొత్తాన్ని ప్రత్యేక ఖాతాలో డిపాజిట్ చేయాలని స్పష్టం చేసింది. ఈమేరకు ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది ఎన్జీటీ. వ్యర్థాల నిర్వహణకు చర్యలు చేపట్టి పురోగతి చెప్పాలని స్పష్టం చేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1993లో మున్సిపాలిటీల్లో పారిశుద్ధ్య, వ్యర్థాల నిర్వహణ సరిగా లేదని సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. దీనిని పర్యావరణ సురక్షా అనే స్వచ్ఛంద సంస్థ సవాల్ చేసింది. ఈపిటిషన్‌ను 2014లో సుప్రీంకోర్టు పరిధిలోకి వచ్చింది. పిటిషన్‌పై ట్రైబ్యునల్ విచారణ చేపట్టింది. ఈమేరకు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. పిటిషన్‌లో 351 నదీ పరివాహక ప్రాంతాలు, 124 నగరాల్లో గాలి కాలుష్యాన్ని పేర్కొన్నారు. 


వంద కాలుష్య కారక పారిశ్రామిక ప్రాంతాలు, ఇసుక అక్రమ మైనింగ్‌పై చర్యలు తీసుకోవాలని సదరు స్వచ్ఛంద సంస్థ విజ్ఞప్తి చేసింది. ఈరెండు విషయాలపై ఎన్జీటీ విచారణ చేపట్టింది. ఇందులోభాగంగానే ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణపై ట్రైబ్యునల్ విచారణ నిర్వహించింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో అన్ని రాష్ట్రాలకు నోటీసులు అందజేసింది. ఈసందర్బంగా ఆయా రాష్ట్రాల సీఎస్‌ల నుంచి వివరణ కోరింది.


పిటిషన్‌పై తెలంగాణ ప్రధాన కార్యదర్శి సోమేష్‌ కుమార్‌ను ఎన్జీటీ విచారించింది. ఐతే ఆయన వివరణపై సంతృప్తి వ్యక్తం చేసింది. ఇందుకు అనుగుణంగా జరిమానా విధిస్తూ తాజాగా నిర్ణయం తీసుకుంది. మొత్తంగా ఎన్జీటీలో మరోమారు తెలంగాణ సర్కార్‌కు షాక్‌ తగినట్లు అయ్యింది.


Also read:Afghanistan: అఫ్ఘనిస్థాన్‌లో మరో ఆత్మాహుతి దాడి..53 మంది మృతి..పలువురికి గాయాలు..!


Also read:ICC T20 WC 2022: వరల్డ్ టాప్-5 టీ20 ప్లేయర్లను ప్రకటించిన గిల్‌క్రిస్ట్..చోటు ఎవరెవరికీ దక్కిదంటే..!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook