NIA Raids: పీఎఫ్‌ఐయే టార్గెట్‌గా ఎన్‌ఐఏ దాడులు..ఉగ్ర మూలాలపై ప్రత్యేక నిఘా..!
NIA Raids: దేశవ్యాప్తంగా ఎన్‌ఐఏ(NIA) దాడులు కొనసాగుతున్నాయి. పీఎఫ్‌ఐ కార్యాలయాలే టార్గెట్‌గా తనిఖీలు సాగుతున్నాయి.
NIA Raids: దేశంలో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(PFI)ను ఎన్‌ఐఏ టార్గెట్ చేసింది. దేశవ్యాప్తంగా ఏకకాలంగా సోదాలను ముమ్మరం చేసింది. పీఎఫ్‌ఐ కార్యాలయాలు, సభ్యుల ఇళ్లపై ఎన్‌ఐఏ, ఈడీ దాడులు కొనసాగుతున్నాయి. దాదాపు వంద మందికి పైగా పీఎఫ్‌ఐ సభ్యులను అరెస్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఉత్తర్‌ప్రదేశ్, కేరళ, కర్ణాటక, తమిళనాడు సహా పలు రాష్ట్రాల్లో దాడులు కొనసాగాయి. మొత్తం పదికిపైగా రాష్ట్రాల్లో అరెస్ట్‌లు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.
ఎన్‌ఐఏ, ఈడీ దాడులను స్వయంగా కేంద్ర హోంశాఖ పర్యవేక్షిస్తోంది. ప్రధానంగా ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు, వ్యవస్థీకృతంగా శిక్షణ, తీవ్రవాద భావ జాలం వంటి ఆరోపణల నేపథ్యంలో దర్యాప్తు చేస్తున్నారు. ఇందులో భాగంగానే దాడులు చేపడుతున్నట్లు దర్యాప్తు సంస్థల అధికారులు తెలిపారు. మొత్తం 200 మందికిపైగా ఎన్‌ఐఏ అధికారులు, ఇతర సిబ్బంది తనిఖీల్లో పాల్గొన్నారు. దాడుల నేపథ్యంలో ఎన్‌ఐఏకు వ్యతిరేకంగా ఆందోళనలు మిన్నంటాయి.
దీంతో కర్ణాటకలో పీఎఫ్‌ఐ, ఎస్‌డీపీఐ సభ్యులను మంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటు కేరళలోని మల్లపురం జిల్లా మంజేరిలో పీఎఫ్‌ఐ ఛైర్మన్ సలాం ఇంటిపై ఎన్‌ఐఏ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఆ దాడులు ఇంకా కొనసాగుతున్నాయి. దీంతో వీటిని నిరసనగా పీఎఫ్‌ఐ సభ్యులు ధర్నాకు దిగారు. కేరళలోని పలు ప్రాంతాల్లో ఎన్‌ఐఏ, ఈడీ చేస్తోంది. తమ సంస్థ కార్యాలయాల్లో దర్యాప్తు సంస్థలు తనిఖీలు చేశాయని పీఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి అబ్దుల్ సత్తార్ తెలిపారు.
మరోవైపు తెలుగు రాష్ట్రాల్లోనూ ఎన్‌ఐఏ సోదాలు కొనసాగాయి. ఏకకాలంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో తనిఖీలు చేపట్టారు. తెలంగాణలో నిజామాబాద్, జగిత్యాల, భైంసాలో సోదాలు కొనసాగాయి. ఇటు ఏపీలోని నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలోనూ తనిఖీలు చేపట్టారు. పాపులర్ ఫ్రంట్ ఆప్ ఇండియా కార్యకలాపాలపై ఆరా తీశారు. ఈకేసులో అనుమానితులు, నిందితుల ఇళ్లల్లో ఏకకాలంలో సోదాలు చేశారు. నిజామాబాద్‌లో మొత్తం 20 చోట్ల నాలుగు ఎన్‌ఐఏ బృందాలు తనిఖీలు చేపట్టారు.
ఇటు నిర్మల్ జిల్లా భైంసాలోనూ సోదాలు కొనసాగాయి. స్థానిక మదీనా కాలనీలోని పలు ఇళ్లల్లో దర్యాప్తు చేశారు. తనిఖీల్లో కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఏపీలో జరిగిన దాడుల్లోనూ కీలక విషయాలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. దేశంలో ఎక్కడ ఏమి జరిగినా..తెలుగు రాష్ట్రాల్లో ఉగ్ర మూలాలు బయటపడుతున్నాయి. ఉగ్ర మూలాలన్నీ హైదరాబాద్‌తోపాటు కీలక నగరాల్లో వెలుగు చూస్తున్నాయి. ఇందులో భాగంగానే ఎన్‌ఐఏ దాడులు చేస్తున్నట్లు తెలుస్తోంది.
Also read:Maharashtra: సొంత చెల్లిపైనే 8 ఏళ్లపాటు కాటేసిన కీచక అన్న.. మౌనాన్ని వీడి 31 ఏళ్ల తర్వాత ఫిర్యాదు..
Also read:IND vs AUS: రేపే భారత్, ఆస్ట్రేలియా మధ్య రెండో టీ20 మ్యాచ్..అతడి రాకపైనే టీమిండియా ఆశలు..!
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.