NIA Raids: 9మంది అల్‌ఖైదా ఉగ్రవాదుల అరెస్ట్
ప్రపంచ తీవ్రవాద సంస్థ అల్ ఖైదా (Al Qaeda) తో సంబంధాలున్న ఉగ్రవాదులను నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) అరెస్టు చేసింది. ఈ మేరకు ఎన్‌ఐఏ అధికారులు పశ్చిమబెంగాల్ ( West Bengal) లోని ముర్షిదాబాద్, కేరళ (Kerala)లోని ఎర్నాకుళంలో శనివారం ఉదయం దాడులు నిర్వహించి 9మంది ఉగ్రవాదులను (Al Qaeda terrorists) అరెస్టు చేసింది.
NIA busts Al Qaeda terror module: న్యూఢిల్లీ: ప్రపంచ తీవ్రవాద సంస్థ అల్ ఖైదా (Al Qaeda) తో సంబంధాలున్న ఉగ్రవాదులను నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) శనివారం అరెస్టు చేసింది. ఈ మేరకు ఎన్‌ఐఏ అధికారులు పశ్చిమబెంగాల్ ( West Bengal) లోని ముర్షిదాబాద్, కేరళ (Kerala)లోని ఎర్నాకుళంలో శనివారం ఉదయం దాడులు నిర్వహించి 9మంది ఉగ్రవాదులను (Al Qaeda terrorists) అరెస్టు చేసింది. వీరందరికీ అల్ ఖైదా ఉగ్రవాద సంస్థతో సంబంధాలున్నాయని ఎన్‌ఐఏ అధికారుల దర్యాప్తులో తేలింది. ఈ ఉగ్రవాదులంతా పాకిస్తాన్ ఉగ్రవాదుల సోషల్ మీడియా ద్వారా స్ఫూర్తి పొందారని.. అయితే.. ముర్షిదాబాద్, ఎర్నాకుళం కేంద్రాలుగా పనిచేస్తూ రాజధాని ఢిల్లీ సహా పలు ప్రాంతాల్లో దాడులు చేయడానికి కుట్ర పన్నినట్లు అధికారులు వెల్లడించారు. Also read: Air India: దుబాయ్‌కు యథావిధిగా విమాన సర్వీసులు
అయితే.. ఈ అల్ ఖైదాతో సంబంధమున్న ఉగ్రవాదుల నుంచి కీలక డాక్యుమెంట్లు, డిజిటల్ డివైజెస్, జిహాది సాహిత్యం, ఆయుధాలు, దేశీయ తుపాకులు, మందుగుండు సామాగ్రి, శరీర కవచాలను స్వాధీనం చేసుకున్నామని ఎన్ఐఏ అధికారులు తెలిపారు. అల్ ఖైదా ఉగ్రవాదుల కదలికలపై కేంద్ర ఇంటెలిజెన్స్ అందించిన సమాచారం మేరకు దాడిచేసి ఉగ్రవాదులను పట్టుకున్నారు. అయితే కేరళలోని ఎర్నాకుళంలో ముగ్గురు ఉగ్రవాదులు.. ముర్షీద్ హసన్, యాకుబ్ బిస్వాస్, ముషారప్ హుస్సేన్‌ను అరెస్టు చేయగా.. పశ్చిమ బెంగాల్ ముర్షిదాబాద్‌లో ఆరుగురు ఉగ్రవాదులు.. షకీబ్, అబు సూఫియాన్, మెయినల్ మోండల్, లీయాన్ అహ్మద్, అల్ మామున్ కమల్, అతితుర్ రెహ్మాన్‌ను అరెస్ట్ చేశారు. అయితే వీరిందరినీ ఆయా రాష్ట్రాలకు సంబంధించిన కోర్టుల్లో హాజరుపర్చి తదుపరి దర్యాప్తు కోసం ఎన్ఐఏ అధికారులు కస్టడీలోకి తీసుకోనున్నారు. Also read: Urmila Matondkar: కంగనా అడల్ట్ స్టార్ కామెంట్‌పై ఊర్మిళ ట్వీట్