Darbhanga Blast: బీహార్ దర్భంగా పేలుడు ఘటన దర్యాప్తు ముమ్మరమైంది. దర్భంగా పేలుడు ఘటన నిందితుల విచారణ ఓ వైపు జరుగుతుండగానే..ఎన్ఐఏ నిందితులిద్దరినీ ఢిల్లీకు తరలించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బీహార్‌లోని దర్భంగా రైల్వే స్టేషన్‌లో జరిగిన పేలుడు ఘటన(Darbhanga Blast case) దేశవ్యాప్తంగా కలకలం కల్గించింది. ఈ కేసు దర్యాప్తు ఎన్ఐఏ చేపట్టింది. దర్భంగా పేలుడు ఘటనలో నిందితులుగా భావిస్తున్న ఇద్దరిని హైదరాబాద్ మల్లేపల్లి ప్రాంతంలో పట్టుకున్నారు. నిందితులుగా ఉన్న ఇమ్రాన్ మాలిక్, నాసిర్ మాలిక్‌లు లష్కర్ ఏ తోయిబాకు చెందినవారుగా తెలుస్తోంది. ఎన్ఐఏ ఈ ఇద్దరు నిందితుల్ని ఢిల్లీకు తరలించింది. కస్డడీ గడువు పూర్తి కావడంతో పాట్నాలోని ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరిచారు ఎన్ఐఏ అధికారులు. మరింత సమాచారం సేకరించాల్సి ఉందంటూ మరో పదిరోజుల కస్టడీ కోసం కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఈ పిటీషన్‌పై విచారణ జరిపిన పాట్నా ప్రత్యేక న్యాయస్థానం(Patna Special Court) ఈ నెల 16 వరకూ అనుమతిచ్చింది. వెంటనే తదుపరి విచారణ కోసం ఢిల్లీలోని ప్రధాన కార్యాలయానికి తీసుకెళ్లారు.


ఇదే కేసుకు సంబంధించి ఉత్తరప్రదేశ్‌లోని ఖైరానా నివాసి సలీంను కూడా ఎన్ఐఏ (NIA)అదుపులో తీసుకోవాలని భావించింది. అయితే అనారోగ్య కారణాలతో ఆసుపత్రిలో చేరడంతో ఎన్ఐఏకు సాధ్యం కాలేదు. దేశవ్యాప్తంగా కలకలం రేపిన ఈ ఘటన దర్యాప్తును ఎన్ఐఏ వేగవంతం చేసింది. 


Also read: GAIL Jobs Notifications 2021: కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ గెయిల్‌లో ఉద్యోగాలు, అర్హత, ఎంపిక విధానం ఇలా


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook