GAIL Jobs Notifications 2021: కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ గెయిల్‌లో ఉద్యోగాలు, అర్హత, ఎంపిక విధానం ఇలా

GAIL Jobs Notifications 2021: నిరుద్యోగులకు శుభవార్త. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వెలువడింది. ప్రముఖ ప్రభుత్వరంగ సంస్థ గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌లో ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jul 12, 2021, 07:09 PM IST
GAIL Jobs Notifications 2021: కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ గెయిల్‌లో ఉద్యోగాలు, అర్హత, ఎంపిక విధానం ఇలా

GAIL Jobs Notifications 2021: నిరుద్యోగులకు శుభవార్త. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వెలువడింది. ప్రముఖ ప్రభుత్వరంగ సంస్థ గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌లో ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం(Central government job) కోసం ఎదురు చూస్తున్నారా..అయితే ఈ అవకాశం మీ కోసమే. న్యూ ఢిల్లీ ప్రధాన కేంద్రంగా ఉన్న ప్రముఖ భారత ప్రభుత్వ రంగ సంస్థ గెయిల్‌లో వివిధ విభాగాల్లో ఉన్నత స్థాయి ఉద్యోగాలున్నాయి.గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌లో(GAIL JOBS) 220 పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది గెయిల్ సంస్థ. మేనేజర్, సీనియర్ మేనేజర్, సీనియర్ ఆఫీసర్, ఆఫీసర్ విభాగాల్లో ఈ ఉద్యోగాలున్నాయి. మార్కెటింగ్, కెమికల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్, సివిల్, హెచ్ఆర్, లా విభాగాల్లో గ్రాడ్యుయేషన్, ఇంజనీరింగి డిగ్రీ, ఎంబీఏ, పీజీ డిప్లొమా, సీఏ లేదా సీఎంఏ ఉత్తీర్ణత సాధించినవారు ఈ పోస్టులకు అర్హులు. అంతేకాకుండా సంబంధిత పనిలో అనుభవముండాలి.

షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్ధుల్ని గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. దరఖాస్తు చేయడానికి చివరి తేదీ 2021 ఆగస్టు 5 వతేదీగా ఉంది. దరఖాస్తు చేసేందుకు, ఇతర వివరాలకు https://www.gailonline.com వెబ్‌సైట్‌ను సంప్రదించాలి. 

Also read: Parliament Monsson Sessions: జూలై 19 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News