న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంకును రూ.14,000 కోట్ల మేర మోసం చేసిన కేసులో ప్రధాన నిందితుడిగా వుండి దేశం విడిచిపారిపోయిన నిరవ్ మోడీని ఇవాళ లండన్‌లో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. లండన్‌లోని హాల్‌బర్న్ మెట్రో స్టేషన్‌లో నిరవ్ మోడీని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడిని లండన్‌లోని వెస్ట్ మినిష్టర్ కోర్టులో హాజరుపర్చారు. 


నిరవ్ మోడీ కేసును విచారణకు స్వీకరించిన కోర్టు.. ఈ కేసును మార్చి 29వ తేదీకి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది. కోర్టు చీఫ్ మెజిస్ట్రేట్ ఎదుట మార్చి 29వ తేదీన నిరవ్ మోడీ అప్పగింత కేసు విచారణకు రానుంది.