Nirbhaya Mother reaction over Karnataka MLA 'enjoy rape' remarks: కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే కేఆర్ రమేష్ కుమార్ ఇటీవల అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమవుతున్న సంగతి తెలిసిందే. బాధ్యతాయుతమైన ప్రజాప్రతినిధి హోదాలో ఉండి అత్యాచారాన్ని ఎంజాయ్ చేయాలంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా నిర్భయ తల్లి ఆశా దేవి (Nirbhaya's Mother) ఎమ్మెల్యే కేఆర్ రమేష్ కుమార్ వ్యాఖ్యలపై స్పందించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఎమ్మెల్యే కేఆర్ రమేష్ అసెంబ్లీలో (Karnataka Assembly) ఆ కామెంట్స్ చేసిన సమయంలో స్పీకర్ సహా మిగతా ఎమ్మెల్యేలంతా నవ్వడంపై ఆశా దేవీ ఆగ్రహం వ్యక్తం చేశారు. 'స్పీకర్ ఎందుకు నవ్వారు.. ఆ ఎమ్మెల్యే కామెంట్లను మిగతా ఎమ్మెల్యేలు ఎంజాయ్ చేశారు... నవ్వారు.. వారందరినీ అసెంబ్లీ నుంచి బహిష్కరించాలి.' అని ఆశా దేవీ డిమాండ్ చేశారు.


'ఓ పెద్దమనిషి.. తనను అత్యాచారం చేయండని చెబుతున్నాడు. అసలు అత్యాచారమంటే ఏంటో ఆయనకు తెలుసా.. ఆయన ఇంట్లో ఎవరైనా అత్యాచారానికి గురయ్యారా...?' అని స్పీకర్‌ను ఉద్దేశించి ఆశా దేవీ (Nirbhaya Mother Asha Devi) ఆగ్రహం వ్యక్తం చేశారు. అత్యాచారం అనివార్యమైనప్పుడు పడుకుని ఎంజాయ్ చేయాలంటూ కేఆర్ రమేష్ కుమార్ కామెంట్ చేయగా... 'ఇప్పుడు నేను ఎస్, ఎస్ అంటూ ఎంజాయ్ చేయాల్సిన పరిస్థితిలో ఉన్నా...' అని స్పీకర్ కగెరి వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. సభాధ్యక్షుడైన స్పీకర్ ఇలాంటి దిగజారుడు వ్యాఖ్యలు చేయడమేంటని ఆశా దేవీ మండిపడ్డారు.


కేఆర్ రమేష్ కుమార్ వ్యాఖ్యలపై లోక్‌సభలోనూ ఆగ్రహం వ్యక్తమైన సంగతి తెలిసిందే. సభలో ఈ విషయాన్ని ప్రస్తావించిన కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ కేఆర్ రమేష్ కుమార్‌ను కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాదు, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ క్షమాపణ చెప్పాలన్నారు. కాగా, అసెంబ్లీలో తన వ్యాఖ్యలపై కేఆర్ రమేష్ కుమార్ ఇప్పటికే క్షమాపణలు చెప్పారు. క్రూరమైన అత్యాచార చర్యను చిన్నది చేసి చూపడం తన ఉద్దేశం కాదని... ఇకపై జాగ్రత్తగా మాట్లాడుతానని తెలిపారు. అయితే కేఆర్ రమేష్ కుమార్ (KR Ramesh Kumar) కేవలం క్షమాపణ చెబితే సరిపోదని... ఆయన్ను అసెంబ్లీ నుంచి, పార్టీ నుంచి బహిష్కరించాల్సిందేనన్న డిమాండ్స్ వెల్లువెత్తుతున్నాయి.


Also Read: విరాట్ కోహ్లీ యాటిట్యూడ్‌ ఇష్టమే.. కానీ ఆ లక్షణమే నాకు అస్సలు నచ్చదు: గంగూలీ


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook