న్యూఢిల్లీ: నిర్భయ గ్యాంగ్ రేప్, హత్య కేసు దోషులకు క్షమాభిక్ష పెట్టాలని సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్ కోరడం వివాదానికి కేంద్ర బిందువు అవుతోంది. దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ దోషులను సోనియా గాంధీ క్షమించినట్లుగానే.. నిర్భయ తల్లి నలుగురు దోషులను క్షమించాలని సీనియర్ న్యాయవాది కోరారు. ఇందిరా జైసింగ్ కామెంట్లపై నిర్భయ తల్లి ఆశా దేవి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇందిరా లాంటి వారి వల్లే అత్యాచార కేసులో దోషులకు శిక్ష పడటం లేదన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: ‘నిర్భయ’ కేసులో సరికొత్త ట్విస్ట్.. దోషులకు ఉరిశిక్ష వాయిదా


తనకు అలాంటి సలహా ఇచ్చేందుకు ఇందిరా జైసింగ్ ఎవరు, ఆమెకు ఎంత ధైర్యమని నిర్భయ తల్లి ప్రశ్నించారు. మహిళా న్యాయవాది వ్యాఖ్యలకు స్ట్రాంగ్‌గా బదులిచ్చారు. తాను సుప్రీంకోర్టులో పలు పర్యాయాలు ఇందిరను కలిశానని, అయితే ఒక్కసారి కూడా తన యోగక్షేమాలు అడగలేదని ఆశా దేవి వెల్లడించారు. కానీ నిర్భయ కేసు దోషుల గురించి ఆమె మాట్లాడుతుంది. రేపిస్టులకు మద్దతు తెలుపుతూ పబ్బం గడుపుతోంది. ఆమె లాంటి వ్యక్తుల వల్లే అత్యాచార ఘటనలు ఇంకా కొనసాగుతున్నాయని’ నిర్భయ తల్లి ఆందోళన వ్యక్తం చేశారు.


Also Read: కేజ్రీవాల్‌పై పోటీ చేయను: నిర్భయ తల్లి ఆశా దేవి



కాగా, రాజీవ్ గాంధీ హత్య కేసు దోషి నళిని శ్రీహరన్‌కు సోనియా గాంధీ క్షమాభిక్ష పెట్టినట్లుగానే.. కూతురి గ్యాంగ్ రేప్, హత్య కేసు దోషులకు మరణశిక్ష పడకుండా నిర్భయ తల్లి క్షమాభిక్ష ప్రసాదించాలని సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్ జనవరి 17న కోరారు. అదే రోజు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నిర్భయ కేసు దోషి ముకేశ్ క్షమాభిక్ష పిటిషన్‌ను తిరస్కరించిన విషయం తెలిసిందే. జనవరి 22న విధించాల్సిన ఉరిశిక్షను ఫిబ్రవరి 1కి వాయిదా వేస్తూ ఢిల్లీ కోర్టు తాజాగా డెత్ వారెంట్ జారీ చేసింది. దోషుల మాటలు మాత్రమే వింటున్నారని, బాధితుల గళాన్ని ఎవరూ పట్టించుకోరంటూ నిర్భయ తల్లి కన్నీటి పర్యంతమయ్యారు.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..