Nirbhaya mother Asha Devi: కేజ్రీవాల్‌పై పోటీ చేయను: నిర్భయ తల్లి ఆశా దేవి

ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌కు పోటీగా న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నారా అన్న ప్రశ్నకు ఆశా దేవి పై విధంగా స్పందించారు.

Last Updated : Jan 17, 2020, 09:06 PM IST
Nirbhaya mother Asha Devi: కేజ్రీవాల్‌పై పోటీ చేయను: నిర్భయ తల్లి ఆశా దేవి

న్యూఢిల్లీ: తనకు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశమే లేదని నిర్భయ తల్లి ఆశా దేవి తెలిపారు. తనను ఏ కాంగ్రెస్ నేత కలవలేదని, ఆ వదంతులు నిజం కాదని స్పష్టం చేశారు. ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌కు పోటీగా న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నారా అన్న ప్రశ్నకు ఆశా దేవి పై విధంగా స్పందించారు. తనకు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశమే లేదని, ఆ దోషులకు ఉరిశిక్ష అమలై తన కూతురుకు న్యాయం జరగడమే తాను కోరుకుంటున్నట్లు తెలిపారు.

Also Read: నిర్భయ ఘటన: ఆ రోజు ఏం జరిగింది?

ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్ సుభాష్ చోప్రా సైతం ఇదే తీరుగా స్పందించారు. నిర్భయ తల్లిని కాంగ్రెస్ పార్టీ నేతలు సంప్రదించలేదన్నారు. ఆయన ఏఎన్ఐతో మాట్లాడుతూ.. ‘2012లో ఢిల్లీలో గ్యాంగ్ రేప్, హత్యకు గురైన యువతి తల్లి ఆశా దేవి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం అరవింద్ కేజ్రీవాల్‌పై కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నట్లు మీడియాలో కథనాలు చూశాను. ఆమె మా పార్టీలో చేరాలనుకుంటే కచ్చితంగా స్వాగతిస్తామని’ చెప్పారు.

Also read: ‘నిర్భయ’ కేసులో సరికొత్త ట్విస్ట్.. దోషులకు ఉరిశిక్ష వాయిదా

కాగా, నిర్భయ కేసు దోషుల ఉరిశిక్ష అమలు జనవరి 22నుంచి ఫిబ్రవరి 1కి వాయిదా పడటంతో ఆశా దేవి తీవ్ర నిరాశకు లోనయ్యారు. నలుగురు దోషులు ముకేశ్ సింగ్‌ (32), పవన్‌ గుప్తా (25), వినయ్‌ శర్మ (26), అక్షయ్‌ కుమార్‌ ఠాకూర్‌ (31) ఉరిశిక్షను వాయిదా వేస్తూ ఢిల్లీ కోర్టు మరో డెత్ వారెంట్ జారీ చేసిన అనంతరం ఆశాదేవి మీడియాతో మాట్లాడారు. ‘కోర్టు, ప్రభుత్వం నిర్ణయాలతో నిరాశచెందా. వాయిదా వేసిన తేదీకైన దోషులను ఉరితీస్తారా. లేక అప్పుడు కూడా వాయిదా వేస్తారో. దోషులు అడిగిన విధంగా శిక్ష వాయిదా వేస్తున్నారు. కానీ న్యాయం కోరుతున్న వారి మాటల్ని మాత్రం పరిగణించడం లేదంటూ’ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.   జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News