భారత రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేస్తూ.. తూర్పు నౌకాదళం మరో చారిత్రక ఘట్టానికి శ్రీకారం చుట్టనుంది. ఇందుకు వేదికగా  వైజాగ్ ముస్తాబవుతోంది. ఈనెల 16 వ తేదీన కేంద్ర రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ చేతులమీదుగా 'కిల్తాన్' జలప్రవేశం చేయనుంది. కేంద్రంలో రక్షణ శాఖ పగ్గాలు చేపట్టాక మొదటిసారి నిర్మలా సీతారామన్ వైజాగ్ కు వస్తున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రాజెక్టు-28లో భాగంగా నాలుగు కమోర్తా క్లాస్ యుద్ధనౌకలను తయారుచేయాలని భారత నౌకాదళం 2003లో భావించింది. ఇందులో  భాగంగా ఇప్పటికే  2014 లో కమోర్తా, 2016 లో కద్మత్ లు నౌకాదళంలో చేరాయి. 2017 అక్టోబర్ 16న మూడో యుద్ధ నౌక 'ఐఎన్ఎస్ కిల్తాన్' ను జలప్రవేశం చేయనుంది. కమోర్తా క్లాస్ యుద్ధ నౌకలకు లక్షద్వీప్ దీవుల పేర్లు పెట్టడం ఆనవాయితీ. అందుకే అందులో ఒకటైన కిల్తాన్ దీవి పేరు పెట్టారు. 


'ఐఎన్ఎస్ కిల్తాన్' ప్రత్యేకతలు :


* 90% స్వదేశీ పరిజ్ఞానంతో తయారు; బరువు - 4 వేల టన్నులు ; పొడవు - 109 మీటర్లు; సిబ్బంది - 123 మంది 


* కార్బైన్ ఫైబర్ తో తయారైన మొట్టమొదటి షిప్ (ఇది స్టీల్ కంటే పది రెట్లు బరువు తక్కువ) 


* తేలికగా ఉంటుంది, సముద్రంలో చాలా తక్కువ శబ్దంతో వేగంగా దూసుకెళుతుంది (గంటకు 25 నాటికల్ మైళ్ల వేగంతో) 


* రాడార్లకు చిక్కదు, ఎటువంటి వాతావరణంలోనైనా సమర్ధవంతంగా పనిచేస్తుంది


* ఇందులో అత్యాధునిక ఆయుధాలు, రాకెట్ లాంచర్లు, టార్పెడో ట్యూబ్ లాంచర్లు, ఇతర యుద్ధ సామాగ్రి ఉంటాయి