Nithyananda Swamy: వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానంద మరోసారి వార్తలకెక్కారు. మధురై పీఠం విషయమై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. మధురై పీఠంపై నిత్యానంద కన్నేయడం చర్చనీయాంశమవుతోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నిత్యానందస్వామి. ఓ వివాదాస్పద విచిత్ర స్వామి. చాలాకాలంగా వార్తలకు దూరంగా ఉన్న నిత్యానంద (Nithyananda swamy)మరోసారి వార్తలకెక్కారు. మధురైలోని ప్రసిద్ధి చెందిన శైవమఠానికి 293వ ఆధీనంగా బాధ్యతలు స్వీకరించినట్టు వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానంద ప్రకటించారు. ఇదే ఇప్పుడు సంచలనంగా మారింది. నిత్యానందపై ఆరోపణల అనంతరం దేశం విడిచి వెళ్లిపోయారు. సొంతంగా కైలాస దేశం స్థాపించానని ప్రకటించుకున్నారు. అంతేకాదు ఆ దేశానికి ఓ కరెన్సీ, వీసా కూడా ఏర్పాటు చేసుకున్నారు. 


ఇప్పుడు హఠాత్తుగా మధురై పీఠం(Madurai peetham) బాధ్యతలు తీసుకున్నట్టు ప్రకటించడం వివాదంగా మారింది. అయితే కైలాసదేశం(Kailasadesam) నుంచే ఆన్‌లైన్ ద్వారా భక్తులకు ఆశీస్సులు అందించనున్నట్టు తెలిపారు. తన పేరును కూడ జగద్గురు మహాసన్నిధానం శ్రీలశ్రీభగవాన్ నిత్యానంద పరమశివజ్ఞాన సంబంధ దేశిక పరమాచార్య స్వామిగా మార్చుకున్నట్టు సోషల్ మీడియా వేదిక ద్వారా ప్రకటించారు. మధురై శైవమఠానికి కొన్ని దశాబ్దాలపాటు 292వ మఠాధిపతిగా సేవలందించిన అరుణ గిరినాధర్ గత వారమే శివైక్యం పొందడంతో నిత్యానంద ఆ పీఠంపై తనను తాను అధిపతిగా ప్రకటించుకున్నారు. ఆయన పార్ధీవదేహాన్ని మహాసమాధి చేసిన తరువాత అదే మఠంలో 5 వందల కేజీలతో అరుణ గిరినాధర్ పాలరాతి శిల్పం ప్రతిష్ఠించి పూజలు చేస్తున్నారు. 293వ ఆధీనంగా హరిహర జ్ఞాన సంబంధం దేశీయ పరమాచార్య బాధ్యతలు చేపట్టారు. ఈ మఠం రహస్యగదిలోని ఆభరణాలు, విలువైన వజ్రాలు, మధురై పీఠం ఆస్థుల దస్తావేజుల్ని 293వ ఆధీనానికి అప్పగించారు. అయినా సరే నేనే పీఠాధిపతినని ప్రకటించుకోవడం వివాదానికి దారి తీస్తోంది.  


Also read: Afghanistan Currency Value: దేశంలో నెలకొన్న పరిణామాలతో పడిపోయిన ఆఫ్ఘన్ కరెన్సీ


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook