Afghanistan Currency Value: ఆఫ్ఘనిస్తాన్‌ను తాలిబన్లు ఆక్రమించడంతో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. ఆర్ధిక పరిస్థితులు తలకిందులవుతున్నాయి. ఫలితంగా ఆఫ్ఘన్ కరెన్సీపై విపరీతమైన ప్రభావం పడింది.
ఆఫ్ఘన్ నేలపై మరోసారి తాలిబన్ రాజ్యం(Taliban government) ఏర్పడింది. తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్‌ను ఆక్రమించడంతో పాటే పరిస్థితులు వేగంగా మారిపోయాయి. దేశాధ్యక్షుడు,సెంట్రల్ బ్యాంక్ తాత్కాలిక గవర్నర్ దేశం విడిచి పారిపోయారు.ఇక పెట్టుబడిదారులు కూడా దేశం విడిచి వెళ్లిపోయేందుకు సిద్ధమవుతున్నారు.అటు తాలిబన్లపై ఉన్న భయంతో వేలాదిమంది దేశం విడిచి బయటకు వెళ్లిపోయేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ పరిణామాల ప్రభావం ఆఫ్ఘన్ కరెన్సీపై ఎక్కువ ప్రభావం చూపుతోంది.
ఆఫ్ఘనిస్తాన్‌లో(Afghanistan) ఆర్ధిక పరిస్థితులు తలకిందులైపోయాయి. కరెన్సీ విలువ రికార్డు స్థాయిలో పడిపోయిందని బ్లూమ్‌బెర్గ్ నివేదిక(Bloomberg Report) స్పష్టం చేసింది. ఆఫ్ఘన్ కరెన్సీ విలువ ఇవాళ 4.6 శాతం పడిపోయి..86.0625కు చేరుకుంది.తాలిబన్లు దేశాన్ని ఆక్రమించుకున్న రోజు నుంచి వరుసగా నాలుగవరోజు కరెన్సీ విలువ క్షీణించింది.ప్రస్తుతం కరెన్సీ విలువ 81 నుంచి 100కు పెరిగి తరువాత 86కు పడిపోయింది.ఆఫ్ఘన్ అధ్యక్షుడు తాలిబన్లను ఎదుర్కోకుండా దేశాన్ని విడిచిపెట్టి పోవడంతోనే ఈ గందరగోళం ఏర్పడినట్టు తెలుస్తోంది. అటు అమెరికా తాజాగా తాలిబన్లకు(Talibans) షాకిచ్చింది. నిధులు దక్కకుండా అమెరికా బ్యాంకుల్లోని ఆఫ్ఘన్‌కు సంబంధించిన నిధుల్ని ఫ్రీజ్ చేస్తున్నట్టు ప్రకటించింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook