‘నమామీ గంగె’ పేరుతో గంగా నదీ ప్రక్షాళనకై కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కార్యక్రమానికి భారత రాష్ట్రపతితో ప్రధాని మోదీ కూడా తమవంతు సహాయంగా వారి నెలజీతాన్ని విరాళంగా ఇవ్వాలని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ వారికి లేఖ రాశారు. అలాగే కేంద్ర మంత్రులు,రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా తమ జీతాన్ని ఈ పవిత్ర కార్యక్రమానికి విరాళంగా ఇస్తే బాగుంటుందని కోరారు.


అలాగే సామాన్య ప్రజలు కూడా ఈ మహోన్నత కార్యక్రమంలో పాల్గొనవచ్చని ఆయన తెలిపారు. వారిచ్చే విరాళాలకు పన్ను మినహాయింపు కూడా ఉంటుందని తెలిపారు. కాలుష్య ప్రభావానికి లోనైన గంగా నది ప్రక్షాళనకు 2015లో కేంద్ర ప్రభుత్వం నడుం బిగించిందని.. 2020లోపు ఈ నదికి పూర్వ రూపం తీసుకురావాలని.. అందుకు అందరూ సహకరించాలని మంత్రి కోరారు.  ఇప్పటికే గంగా నది ప్రక్షాళన కోసం కేంద్ర ప్రభుత్వం రూ.20,000కోట్లు కేటాయించింది. అలాగే క్లీన్‌ గంగా ఫండ్ (సీజీఎఫ్‌)కు బయట సంఘాల నుండి దాదాపు రూ.250కోట్ల వరకూ నిధులొచ్చాయి.