కరోనా వైరస్ ఇంకా భారత్‌లోకి ప్రవేశించలేదు.. !!
చైనాలో వణుకు పుట్టిస్తున్న కరోనా వైరస్.. మిగతా దేశాలను కూడా గజగజలాడిస్తోంది. ప్రపంచ దేశాల్లో ఏ ఏ దేశాలకు ఈ వైరస్ వ్యాప్తి చెందిందనేది ఇప్పటికీ నిర్ధారణ కావడం లేదు. చైనాలో మాత్రం ఇప్పటికి 106 మంది ప్రాణాలు మింగేసింది.
చైనాలో వణుకు పుట్టిస్తున్న కరోనా వైరస్.. మిగతా దేశాలను కూడా గజగజలాడిస్తోంది. ప్రపంచ దేశాల్లో ఏ ఏ దేశాలకు ఈ వైరస్ వ్యాప్తి చెందిందనేది ఇప్పటికీ నిర్ధారణ కావడం లేదు. చైనాలో మాత్రం ఇప్పటికి 106 మంది ప్రాణాలు మింగేసింది. ముఖ్యంగా ఒక్క వుహాన్‌లోనే 100 మంది మృతి చెందారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఈ వైరస్‌పై భయాందోళనలు నెలకొన్నాయి.
భారత్‌లో దేశ రాజధాని ఢిల్లీ సహా అసోం, తెలంగాణ లాంటి రాష్ట్రాల్లో కరోనా వైరస్ వ్యాప్తి చెందిందనే వార్తలు వచ్చాయి. పలువురు రోగులు వ్యాధి లక్షణాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఢిల్లీలో ముగ్గురికి వ్యాధి ఉందనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. మరోవైపు తెలంగాణలో నలుగురికి ఈ వ్యాధి సోకిందనే వార్తలు వచ్చాయి. ప్రస్తుతం వారందరినీ ప్రత్యేక ఐసోలేటెడ్ గదుల్లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎప్పుడు ఏ వార్త వినాల్సి వస్తుందోనని ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్ష వర్థన్ ఓ ప్రకటన చేశారు. ఇప్పటి వరకు భారత్ లోకి కరోనా వైరస్ ప్రవేశించలేదని తెలిపారు. ఎవరూ ఆందోళనకు గురి కావద్దని చెప్పారు. కరోనా వైరస్ రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. ఢిల్లీ సహా అన్ని పట్టణాల్లో రోగులకు చికిత్స అందించేందుకు ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేశామని తెలిపారు. త్వరలోనే ఇందుకు సంబంధించి హెల్ప్ లైన్ నంబర్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు.
Read Also:కరోనా వైరసా.. ఐతే ఏంటట..?
మరోవైపు తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తిపై వదంతులు వ్యాపిస్తున్నాయి. చైనా నుంచి వచ్చిన నలుగురికి కరోనా వైరస్ సోకిందనే వార్తలు గుప్పుమంటున్నాయి. ఐతే అలాంటిదేమీ లేదని .. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. ఇప్పటి వరకు కరోనా వైరస్ ఉన్నట్లు నిర్ధారణ కాలేదన్నారు. ఎవరూ దీనిపై ఆందోళన చెందవద్దని కోరారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..