గాంధీ హత్యాకాండ: రెండవ దాడి అవాస్తవం
మహాత్మాగాంధీ హత్యాకాండలో రెండవ దాడికి సంబంధించి ఎటువంటి ఆధారాలు లేవని సుప్రీంకోర్టు సోమవారం తెలిపింది.
మహాత్మాగాంధీ హత్యాకాండలో రెండవ దాడికి సంబంధించి ఎటువంటి ఆధారాలు లేవని సుప్రీంకోర్టు సోమవారం తెలిపింది. మహాత్మా గాంధీ హత్య కేసు పునర్విచారణ కోరుతూ దాఖలైన పిటీషన్ పై సుప్రీంకోర్టు అమికస్ క్యూరీగా సీనియర్ అడ్వకేట్ అమ్రేంద్ర శరణ్ ను నియమించింది. ఈ అంశంలో సుదీర్ఘ పరిశీలన చేపట్టిన ఆయన సోమవారం నివేదికను అత్యున్నత న్యాయస్థానానికి అందజేశారు.
ముంబయికి చెందిన ఐటి ప్రొఫెసర్ పంకజ్ కుమాద్ చంద్ర ఫడ్నిస్ తన పిటీషన్ లో పేర్కొంటూ- "మహాత్మా గాంధీని మరో నాథురాం గాడ్సే తో పాటు మరో వ్యక్తి కూడా కాల్చారు. అతడు కూడా ఆ ప్రదేశంలోనే ఉన్నాడన్నారు. మహాత్మా గాంధీ జనవరి 30, 1948 న కాల్చి చంపబడ్డారని, అతని హత్యపై తమకు అనుమానాలు ఉన్నాయని అభినవ్ భారత్ యొక్క పరిశోధకుడు మరియు ట్రస్టీ అయిన ఫడ్నిస్ చెప్పారు.
కాగా జాతిపితనును గాడ్సేనే హత్యమార్చాడని.. ఇందులో మరే వ్యక్తి ప్రమేయం లేదని అమికస్ క్యూరీ స్పష్టం చేశారు. కేసును పునర్విచారణ చేయాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు. నేషనల్ ఆర్కైవ్స్ నుంచి అవసరమైన పత్రాలు, నివేదికలను పరిశిలించాకే ఈ నివేదిక సిద్ధం చేశామని.. నాలుగో బుల్లెట్ గాంధీ ప్రాణం తీసిందన్న మాట ఆవాస్తవమని అమ్రేంద్ర శరణ్ తేల్చేశారు.