కేంద్రం ఒక సరికొత్త బిల్లు తీసుకురాబోతుంది. ఈ బిల్లుగానీ అమలులోకి వస్తే ఒకటి, రెండవ తరగతుల విద్యార్థులు ఇక హోంవర్కు చేయక్కర్లేదు. ముఖ్యంగా బాలలపై చదువు పేరుతో తీసుకొస్తున్న ఒత్తిడిని తగ్గించడానికి వారికి స్కూళ్లు హోంవర్కు ఇవ్వకపోవడమే మంచిదని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు విద్యారంగంలో సంస్కరణలకు నాంది పలుకుతూ ఈ బిల్లు తీసుకొస్తున్నట్లు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్‌ జవడేకర్‌ ఓ ప్రకటనలో తెలిపారు.


గతంలో మద్రాసు హైకోర్టు చేసిన సూచనలకు అనుగుణంగా కేంద్రం ఈ బిల్లు ప్రవేశపెట్టి నిర్ణయం తీసుకోవాలని భావిస్తోంది. విద్యార్థులు ఆ వయసులో ఆడుతూ, పాడుతూ చదువు నేర్చుకోవాలని.. అంతేకానీ వారికి హోంవర్కు పేరుతో ఇంట్లో అదనపు ఒత్తిడికి గురిచేయడం మంచిది కాదని ఈ సందర్భంగా  ప్రకటనలో ప్రభుత్వం తెలిపింది.