కోవిడ్ నిర్ధారణ ( covid tests ) పరీక్షలకు ఢిల్లీ ( Delhi ) లో మరిన్ని వెసులుబాట్లు కల్పిస్తున్నారు. కరోనా వైరస్ నిర్దారణ పరీక్షల కోసం ఇకపై డాక్టర్ ప్రిస్క్రిప్షన్ అవసరం లేదని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలనుకుంటే ఇకపై మీకు ఏ విధమైన డాక్టర్ ప్రిస్క్రిఫ్షన్ ( No need of doctor prescription ) అవసరం లేదు. ఢిల్లీలో ఈ మేరకు వెసులుబాట్లు కల్పించారు. స్వయంగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ( Delhi cm arvind kejriwal ) ఈ విషయాన్ని స్పష్టం చేశారు. అటు ఢిల్లీ హైకోర్టు మాత్రం కరోనా పరీక్ష చేయించుకునేవారు ఆధార్ కార్డును తీసుకెళ్లాలని..ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అందించే ఫామ్స్ నింపాలని తెలిపింది.   


కోవిడ్ పరీక్షల్ని పెంచేందుకు రాష్ట్రం ప్రభుత్వం చేపడుతున్న చర్యల్లో ఇదొక భాగమని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. ఢిల్లీ ప్రభుత్వం పరీక్ష సామర్ధ్యాన్ని అనేక రెట్లు పెంచిందని ఆయన చెప్పారు. ఇకపై ఏ వ్యక్తి అయినా సులభంగా పరీక్ష చేయించుకోవచ్చు. గత కొన్ని రోజులుగా దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు, మరణాలు పెరుగుతున్నాయి. Also read: Anand Mahindra: మరింతగా భయపెట్టకండి