Anand Mahindra: మరింతగా భయపెట్టకండి

తనదైన శైలిలో ట్వీట్లు, రీ ట్వీట్లతో చురుగ్గా ఉండే ఆనంద్ మహీంద్ర ( Anand Mahindra ) మరో వ్యంగ్యాస్త్రాన్ని సంధించారు. అది కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఛీఫ్ టెడ్రోస్ అథనామ్ పై. 

Last Updated : Sep 8, 2020, 06:36 PM IST
Anand Mahindra: మరింతగా భయపెట్టకండి

తనదైన శైలిలో ట్వీట్లు, రీ ట్వీట్లతో చురుగ్గా ఉండే ఆనంద్ మహీంద్ర ( Anand Mahindra ) మరో వ్యంగ్యాస్త్రాన్ని సంధించారు. అది కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఛీఫ్ టెడ్రోస్ అథనామ్ పై. 

కరోనా మహమ్మారి ( Corona pandemic ) విషయంలో..మరో ఉపద్రవం విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ( WHO Chief ) ఛీఫ్ టెడ్రోస్ అధనామ్ వ్యాఖ్యలపై ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్ర స్పందించారు. ట్వీట్లతో, ఛలోక్తులతో ముందుండే ఆనంద్ మహీంద్ర ఈసారి టెడ్రోస్ అధనామ్ ( Tedros Adhanom ) ను కార్నర్ చేశారు. కరోనా మహమ్మారి చివరిది కాదు..మరో ఉపద్రవానికి మానవజాతి సిద్ధంగా ఉండాలంటూ డబ్ల్యూహెచ్ వో ఛీఫ్ వ్యాఖ్యలు చేశారు. మరోసారి నిరాశకు గురిచేసే ముందు..ప్రస్తుత మహమ్మారి సంక్షోభం నుంచి బయటపడనివ్వండంటూ ట్వీట్ చేశారు ఆనంద్ మహీంద్ర. మమ్మవ్ని మరింత భయపెట్టకండంటూ వ్యంగ్యాస్త్రం సంధించారు. కరోనా నుంచి తేరుకోకముందే మళ్లీ డిప్రెషన్ లో ముంచొద్దంటూ ట్వీట్ చేశారు. 

ఆనంద్ మహీంద్ర ట్వీట్ కు మంచి స్పందన వ్యక్తమవుతోంది.  రీట్వీట్లు, లైక్స్, వ్యంగ్యోక్తులతో నెటిజన్లు హోరెత్తిస్తున్నారు. జనాన్ని భయపెట్టే బదులు డబ్ల్యూహెచ్ వో పరిష్కారం సూచించాలని కోరుతున్నారు. ఆనంద్ మహీంద్ర ట్వీట్ కు మద్దతుగా జనం మాత్రం ప్రపంచ ఆరోగ్య సంస్థ ( World health organisation ) ను ఓ ఆట ఆడుకుంటున్నారు. Also read: PUBG Comeback: చైనా సంస్థతో పబ్ జీ తెగతెంపులు..బ్యాన్ తొలిగే అవకాశం ? 

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x