వాహన ప్రయాణికులకు మరింత వెసులుబాటు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ( Government ) డిజిటల్ డాక్యుమెంట్స్ వినియోగాన్ని పెంచడానికి నిర్ణయం తీసుకుంది. అంటే డ్రైవింగ్ లైసెన్స్ ( Driving Licence ), రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, ఇన్సూరెన్స్ వంటివి ఇక జేబులో పెట్టుకుని తిరగాల్సిన అవసరం లేదు. అక్టోబర్ 1వ తేదీ నుంచి కొత్త మార్పు అమలులోకి రానున్నాయి అని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పోర్టల్ లో పేర్కొంది ప్రభుత్వం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ALSO READ| PM Kisan Samman: రైతులకు మోదీ ప్రభుత్వం రూ. 2000 నజరానా..దరఖాస్తు ఇలా చేయండి


ఇకపై డాక్యుమెంట్స్ చెక్ చేయాల్సి ఉంటే భౌతికంగా అవి మన దగ్గర ఉండే అవసరం లేదు. వాటి తాలూకు డిజిటల్ దస్తావేజులు  పోర్టల్ లో ఉంటాయి. లేదా మన వద్ద డిజిటల్ కాపీలు మొబైల్ లో ఉంటే చూపిస్తే వాటిని క్రాస్ వెరిఫికేషన్ చేస్తారు. మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్ ఫోర్ట్ అండ్ హైవే ( MoRTH) ఇటీవలే మోటర్ వెహికల్  రూల్స్ 1989 పలు సంస్కరణలు చేసింది.


అక్టోబర్ 1వ తేదీ నుంచి వెహిక్యులర్ డాక్యుమెంట్స్, ఈ చాలన్స్ వంటివి పోర్టల్ లో అందుబాటులో ఉంటాయి. దీని వల్ల వాహన చట్టాలను సులభంగా పర్యవేక్షించే అవకాశం ఉంటంది. దీని వల్ల ప్రజలకు చిక్కులు తొలగుతాయి అని పోర్టల్ లో తెలిపింది.


2019 ఆగస్టు 9న కొత్త మోటాల్ వెహికల్స్ యాక్ట్ 2019 ( అమెండ్ మెంట్ ) అమలులోకి వచ్చాక ఈ మార్పు సాధ్యం అయింది. ఒక వాహనానికి సంబంధించిన డాక్యుమెంట్స్, ఈ చలాన్లు తరచూ పోర్టల్ లో అప్డేట్ అవుతుంటాయి. వాటిని రిఫర్ చేస్తే సరిపోతుంది.


ALSO READ|  Driving at Night: డ్రైవింగ్ చేస్తోంటో నిద్ర వస్తోందా? ఇలా చేయండి


అలా ఎలక్ట్రానిక్ విధానంలో వెరిఫికేషన్ విజయవంతంగా పూర్తయితే సదరు వాహన ప్రయాణికుడికి అధికారులు క్లియరెన్స్ ఇచ్చేస్తారు.


పోర్టల్, లేడా ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్స్ ద్వారా కాకుండా ఫిజికల్ గా డాక్యుమెంట్స్ కోరితే సదరు అధికారి వివరాలు కూడా పోర్టల్ లో అప్డేట్ చేస్తారు. ఈ చర్యల వల్ల ప్రయాణికులకు ఇక్కట్లు తప్పతాయి అని పోర్టల్ లో వెల్లడించారు.


A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


IOS Link - https://apple.co/3loQYeR