మాజీ సీఎంలు అధికారిక బంగ్లాలను ఖాళీ చేయండి: సుప్రీం కోర్టు
సర్కార్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.
ఉత్తర్ ప్రదేశ్ సర్కార్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఉత్తర్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రులు ప్రభుత్వ బంగ్లాలు వినియోగించుకోవచ్చు అని ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులపై అత్యున్నత న్యాయస్థానం మండిపడింది. ప్రభుత్వ బంగ్లాలను ఖాళీ చేయాలని ఆదేశించింది. పదవీకాలం ముగిసిన తరువాత ఉత్తర్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రులు ప్రభుత్వ బంగ్లాలను ఖాళీ చేయాలని తెలిపింది.
ఈ విషయంలో 2016లో సుప్రీంకోర్టు పలు మాజీ ముఖ్యమంత్రులకు నోటీసులు అందజేసింది. నోటీసులు అందుకున్నవారిలో కాంగ్రెస్ పార్టీ నేత ఎన్డీ తివారీ, బీఎస్పీ అధినేత్రి మాయావతి, బీజేపీ నేత కల్యాణ్ సింగ్, రాజ్నాథ్ సింగ్, ఎస్పీ నేతలు ములాయం సింగ్ లు ఉండగా వీరితో పాటు ఇప్పుడు తాజాగా అఖిలేష్ యాదవ్‌కు కూడా ఈ జాబితాలో చేరారు.