No one will be left behind due to one's religion: PM Narendra Modi: న్యూఢిల్లీ: ఎలాంటి వివక్ష లేకుండా ప్ర‌తి ఒక్క‌రికీ రాజ్యాంగ హ‌క్కులు అందే విధంగా దేశం ముందుకు వెళ్తున్న‌ట్లు ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర మోదీ అన్నారు. మతాలకు అతీతంగా దేశం అభివృద్ధి వైపు పయనిస్తోందని మోదీ తెలిపారు. యూపీ (Uttar Pradesh) లోని అలీఘ‌ర్ ముస్లిం యూనివ‌ర్సిటీ శ‌తాబ్ధి (Aligarh Muslim University) ఉత్స‌వాల్లో భాగంగా జరిగిన కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్ర‌సంగించారు. మ‌తం ఆధారంగా ఏ ఒక్క వ‌ర్గాన్ని కూడా నిర్ల‌క్ష్యం చేయ‌డం లేద‌ని, త‌మ ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టిన ప‌థ‌కాలు మతాలకు అతీతంగా అందుతున్నాయని ఆయ‌న వెల్ల‌డించారు. సబ్‌కా సాత్, సబ్‌కా వికాస్, సబ్‌కా విశ్వాస్.. తమ ప్రభుత్వ లక్ష్యమని ప్రధాని మోదీ (PM Narendra Modi) అన్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశాభివృద్ధి, ప్ర‌గ‌తి విష‌యంలో సైద్ధాంతిక విభేదాల‌ను ప‌క్క‌న పెట్టాల్సిన అవ‌స‌రం ఉంద‌ని.. తప్పుదోవ పట్టించే వారి పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీ సూచించారు. ఏ మ‌తంలో పుట్టినా.. జాతీయ ల‌క్ష్యాల‌కు త‌గిన‌ట్లుగా ప్ర‌జాజీవ‌నం ఉండాల‌న్నారు. అలీఘ‌ర్ ముస్లిం యూనివ‌ర్సిటీ (AMU) అనేక మంది స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుల‌ను అందించిందని ప్రధాని మోదీ (PM Modi) గుర్తుచేశారు. గత 100 ఏళ్లలో ప్రపంచంలోని అనేక దేశాలతో భారతదేశ సంబంధాలను బలోపేతం చేయడానికి ఏఎంయూ కృషి మరువలేనిదని ప్రధాని పేర్కొన్నారు. దీంతోపాటు కరోనా మహమ్మారి సమయంలో కూడా ఏఎంయూ విశేష సేవలందించిందని ఆయన ప్రశంసించారు. Also read: Farmer protests: రైతులందరూ ఆ లేఖను చదవాలి: ప్రధాని మోదీ


భారతదేశ 75వ స్వాతంత్ర్య దినోత్సవానికి అనుగుణంగా.. చరిత్రలో కనుమరుగైన స్వాతంత్ర్య సమరయోధుల గురించి పరిశోధనలు చేయాలని ప్రధాని ఏఎంయూ అధికారులను సూచించారు. అలీఘ‌ర్ ముస్లిం యూనివ‌ర్సిటీ శ‌తాబ్ధి ఉత్స‌వాల్లో (AMU centenary celebrations) భాగంగా స్మారక పోస్టల్ స్టాంప్‌ను సైతం పీఎం మోదీ విడుదల చేశారు. Also read: Hathras Case: గ్యాంగ్ రేప్ నిజమే.. సీబీఐ చార్జిషీట్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook