No question hour in Parliament's monsoon session: న్యూఢిల్లీ‌: భారత్‌లో కరోనావైరస్ మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది. ఈ క్రమంలో ఈ నెల 14 నుంచి అక్టోబరు 1 వరకు పార్లమెంటు వర్షాకాల సమావేశాలు (Parliament monsoon session) నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. అయితే కరోనావైరస్ కారణంగా ఈ సారి సమావేశాల కోసం ప్రత్యేక ఏర్పాట్లతోపాటు.. సభ్యులకు పలు షరతులు కూడా విధిస్తూ ఉత్తర్వులను జారీ చేశారు ఉభయసభల అధికారులు. సమావేశాలు ప్రారంభమయ్యే 72 గంటల ముందు సభ్యులు, అధికారులు, జర్నలిస్టులు కరోనా పరీక్షలు చేయించుకోవాలని, కోవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, ఈ 15 రోజుల కాలంలో సెలవులు కూడా రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలోనే.. తాజాగా ప్ర‌శ్నోత్త‌రాల స‌మ‌యాన్ని (question hour) కూడా ఎత్తివేస్తున్న‌ట్లు రాజ్య‌స‌భ సెక్ర‌టేరియేట్ ఓ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు. ప్రైవేటు మెంబ‌ర్స్ బిజినెస్ ఉండ‌దని.. కేవ‌లం 30 నిమిషాలు మాత్ర‌మే జీరో అవ‌ర్ ఉంటుందని పేర్కొన్నారు. సాధార‌ణంగా స‌భ ప్రారంభం కాగానే ప్ర‌శ్నోత్త‌రాల స‌మ‌యం ఉంటుంది. కానీ ఈసారి ఆ క్వ‌శ్చ‌న్ అవ‌ర్‌ను ర‌ద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు.  Also read: Parliament Monsoon Session: 14 నుంచే పార్లమెంట్


కోవిడ్ నేప‌థ్యంలో సోష‌ల్ డిస్టెన్సింగ్ పాటించేలా లోక్‌స‌భ‌, రాజ్య‌స‌భ స‌మావేశాల‌ను వేర్వేరు స‌మ‌యాల్లో నిర్వ‌హించ‌నున్నారు. 14వ తేదీన ఉద‌యం 9 నుంచి మ‌ధ్యాహ్నం 1 వ‌ర‌కు లోక్‌స‌భ‌ను, మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 7గంటల వరకు రాజ్యసభను నిర్వహించనున్నారు. ఆ త‌ర్వాత రోజు నుంచి ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1వరకు రాజ్యసభ, మ‌ధ్యాహ్నం 3 నుంచి రాత్రి 7 వ‌ర‌కు లోక్‌స‌భ‌ను నిర్వ‌హించనున్నారు.  ఇదిలాఉంటే.. క్వ‌శ్చ‌న్ అవ‌ర్‌ను ర‌ద్దు చేయడంపై విపక్షనేతలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించే హ‌క్కును విప‌క్ష నేత‌లు కోల్పోయార‌ని టీఎంసీ నేత డేరిక్ ఓబ్రియన్ ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తంచేశారు. Also read: Parliament Session: ఎంపీలందరికీ కరోనా పరీక్షలు