No Stock Of COVID-19 Vaccine : కరోనా సెకండ్ వేవ్‌లో ప్రపంచంలో ఏ దేశంలోనూ లేనంతగా వైరస్ భారత్‌లో ప్రభావం చూపిస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మే 1 నుంచి మూడో దశ కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభించాలని నిర్ణయం తీసుకుంది. దేశంలో 18 ఏళ్లు పైబడిన అందరూ కోవిడ్19 టీకాలు తీసుకునేందుకు అర్హులు అని ప్రకటించడం తెలిసిందే. ఇందుకోసం పలు రాష్ట్రాలు తాము ఉచితంగానే టీకాలు వేస్తామని ప్రకటనలు చేశాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మే 1 నుంచి తాము మూడో దశ కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభించలేమని నాలుగు రాష్ట్రాలు ప్రకటించాయి. 18 ఏళ్లు పైబడిన అందరికీ టీకాలు వేయడానికి వ్యాక్సిన్ కొరత ఉన్న కారణంగా మూడో దశ వ్యాక్సినేషన్ ప్రారంభించలేమని మహారాష్ట్ర, పంజాబ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ ప్రభుత్వాలు స్పష్టం చేశాయి. తమ రాష్ట్రాలకు తగినన్ని వ్యాక్సిన్ మోతాదులను కేంద్ర ప్రభుత్వం అందించడం లేదని, ఈ క్రమంలో మూడో దశ వ్యాక్సినేషన్ ప్రారంభించడం ఎలా సాధ్యమపడుతుందని ప్రశ్నిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు కరోనా వైరస్(CoronaVirus) వ్యాక్సిన్లు తగిన మోతాదులో పంపిణీ చేయడం లేదని ఆరోపించారు.


Also Read: Gold Price In Hyderabad: బులియన్ మార్కెట్‌లో పతనమైన బంగారం ధరలు, దిగొచ్చిన వెండి ధరలు


సీరం ఇన్‌స్టిట్యూట్ సంస్థ ఉత్పత్తి చేసిన కోవిషీల్డ్ కరోనా వ్యాక్సిన్లను మే 15 తేదీ వరకు సరఫరా చేయలేమని తమకు చెప్పిందని రాజస్థాన్ ప్రభుత్వం ఇటీవల ప్రకటించడం దుమారం రేపుతోంది. రాజస్థాన్ ఆరోగ్యశాఖ మంత్రి రఘు శర్మ మీడియాతో మాట్లాడుతూ.. వ్యాక్సిన్ల కోసం సీరం సంస్థను సంప్రదించగా, కేంద్ర ప్రభుత్వం నుంచి తమకు ఆర్డర్ వచ్చిందని చెప్పినట్లు తెలిపారు. రాజస్థాన్ ప్రభుత్వానికి కోవిడ్19(COVID-19) వ్యాక్సిన్‌ను మే 15 వరకు సరఫరా చేయడం వీలు కాదని తమకు సమాధానం వచ్చిందన్నారు. కేంద్రానికి మాత్రమే వ్యాక్సిన్లు సరఫరా అవుతున్నాయని, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యాక్సిన్ ఇప్పట్లో అందుబాటులోకి రావడం కష్టమేనన్నారు.


Also Read: CSK vs SRH match highlights: రెచ్చిపోయిన గైక్వాడ్, డుప్లెసిస్.. సన్‌రైజర్స్‌పై చెన్నై విజయం


కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలకు ఒకే ధరకు కరోనా వ్యాక్సిన్లు పంపిణీ చేయడం సరైన పద్ధతి అని ఆయన అభిప్రాయపడ్డారు. అలా చేసిన పక్షంలో వ్యాక్సిన్లు అదే ధరకు కొనుగోలు చేయడానికి తమ రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయని స్పష్టం చేశారు. రాజస్థాన్ ఆరోగ్యశాఖ మంత్రి రఘు శర్మ వ్యాఖ్యలతో ఛత్తీస్‌గఢ్ ఆరోగ్య మంత్రి టీఎస్ సింగ్ దేవ్, పంజాబ్ ఆరోగ్యమంత్రి బల్బీర్ సింగ్ సిద్దూ ఏకీభవించారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలకు ఒకే ధరలకు వ్యాక్సిన్ విక్రయాలు చేపట్టాలని, అన్ని రాష్ట్రాలకు వ్యాక్సిన్ మోతాదులు అవసరమైన మేరకు అందుబాటులో ఉండేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.


దేశంలో కరోనా తీవ్రతను అధికంగా ఎదుర్కొంటున్న మహారాష్ట్రలో పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. కరోనా వ్యాక్సిన్ కొరత కారణంగా ఏప్రిల్ 29 నుంచి 40 ప్రైవేట్ వ్యాక్సినేషన్ కేంద్రాలను మూసివేయనున్నారు. మరో 33 ప్రైవేట్ వ్యాక్సినేషన్ కేంద్రాలలో టీకా డోసులు త్వరలో పూర్తయి, కొరత ఏర్పడుతుందని సమాచారం. పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ మాట్లాడుతూ.. కోవిషీల్డ్ టీకాలు 30 లక్షల మోతాదులకు ఆర్డర్ ఇవ్వగా మే 15 కన్నా ముందు టీకాలు సరఫరా చేయలేమని సమాధానం వచ్చిందన్నారు. ఈ నేపథ్యంలో మే 1 నుంచి తాము మూడో దశ కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభించడం అసాధ్యమని ఆ నాలుగు రాష్ట్ర ప్రభుత్వాలు తేల్చి చెబుతున్నాయి.


Also Read: IPL 2021: ఆర్సీబీ ప్లేయర్ AB de Villiers అరుదైన ఘనత, బెస్ట్ స్ట్రైక్ రేట్‌తో 5000 పరుగులు 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook