2 నెలల్లో 10 లక్షల కండోమ్స్ అమ్మకం
భారతదేశంలో తొలిసారిగా ఆన్ లైన్ ఉచిత కండోమ్ సరఫరా స్టోరు ప్రారంభమయ్యాక, దాదాపు 2 నెలల్లో 10 లక్షల కండోమ్స్‌కు ఆర్డర్లు జారీ అయ్యినట్లు నివేదిక తెలిపింది. అయితే ఈ ఆర్డర్లు అత్యధికంగా ఢిల్లీ, కర్ణాటకల నుండే రావడం గమనార్హం. ఈ ఆన్ లైన్ స్టోరు ఇప్పటికి 9.56 లక్షల కండోమ్స్ సరఫరా చేయగా.. అందులో 5.14 కండోమ్స్‌కు సంబంధించిన ఆర్డర్లు ఆరోగ్య సంస్థలు, ఎన్జీఓల నుండే వచ్చాయి. మిగతా 4.41 లక్షల కండోమ్ ఆర్డర్లు సామాన్య జనాల నుండి రావడం గమనార్హం. కుటుంబ నియంత్రణ ప్రచారంలో భాగంగా ప్రారంభమైన ఆ ఫౌండేషన్, కండోమ్స్ తయారీ కోసం హిందుస్తాన్ లాటెక్స్ లిమిటెడ్ కంపెనీతో టై అప్ అయ్యింది. తొలి ప్రయోగంలో భాగంగా కేవలం 10 లక్షల కండోమ్స్ ఆర్డరు ఇచ్చిన ఫౌండేషన్ నిర్వహకులు, అవి కేవలం 2 నెలల్లోనే ఖాళీ అవ్వడంతో ఆశ్చర్యపోయారు. మెడికల్ స్టోర్లకు వెళ్లి కండోమ్స్ అడగడానికి సిగ్గుపడే వారికి వాటిని ఆన్‌లైన్ ద్వారా విక్రయించడం మేలైన పద్ధతి అని ఇప్పటికే పలువురు ఈ విధానంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.