Northeast Monsoon: తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో రానున్న రెండ్రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరిస్తోంది. ఇప్పటికే ఈ రెండు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. ఇవాళ, రేపు పరిస్థితి మరింత విషమించవచ్చని తెలుస్తోంది. అందుకే ఆరెంజ్ అలర్ట్ సైతం జారీ అయింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దక్షిణాదిలో ఈశాన్య రుతుపవనాలు తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో నిన్నట్నించి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఇక ఇవాళ, రేపు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈశాన్య రుతుపవనాల తీవ్రత దృష్ట్యా రెండు రాష్ట్రాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది. అటు పుదుచ్చేరిలో కూడా భారీ వర్షాల హెచ్చరిక జారీ చేశారు అధికారులు. తమిళనాడులో 18 జిల్లాల్లో రెండ్రోజుల వరకూ భారీ వర్షాలు పడనున్నాయి. 


అటు కన్యాకుమారిలో కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదు కావచ్చు. తమిళనాడులోని తిరునల్వేలి, రామనాథపురం, విరుదునగర్, కోయంబత్తూరు, నీలగిరి, తిరువళ్లూరు, రాణిపేట్, తూత్తుకూడి, మధురై, దిండిగల్, చెగల్పట్టు, నాగపట్నం, తిరువూర్, కాంచీపురం, చెన్నై, మైలాడుతురై, తిరువారూర్ జిల్లాల్లో భారీ వర్షాల హెచ్చరిక పొంచి ఉంది. ఇప్పటికే నిన్నట్నించి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా తమిళనాడు, పుదుచ్చేరి, కేరళలోని చాలా ప్రాంతాల్లో జనజీవనం స్థంబించిపోయింది. రోడ్లపై భారీగా నీరు చేరడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. భారీ వర్షాల కారణంగా ఈ మూడు రాష్ట్రాల్లో ఇవాళ, రేపు, ఎల్లుండి విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. 


తమిళనాడులోని 35 జిల్లాల్లో 13.25 మిల్లీమీటర్ల వర్షపాతం, పుదుచ్చేరిలో 12 సెంటీమీటర్లు, కేరళలోని కొన్ని జిల్లాల్లో అత్యదికంగా 7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మరోవైపు రానున్న రెండ్రోజుల్లో ఏపీలోని కోస్తాంధ్ర, రాయలసీమ, యానాం ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో మాత్రం రానున్న రెండ్రోజులు చాలా అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ హెచ్చరించింది. 


Also read: National Herald Case: నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ సంచలన నిర్ణయం.. రూ.752 కోట్ల ఆస్తులు అటాచ్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook