రైల్వేశాఖ ప్రయాణీకులకు కొత్త ఆఫర్‌ను ప్రకటించింది. ఏదైనా కారణం చేత రైలు రద్దయితే ప్రయాణీకులు బుక్ చేసుకున్న టికెట్ల డబ్బులు తిరిగి బ్యాంకు ఖాతాకు అటోమేటిక్‌గా వస్తాయని రైల్వేశాఖ తెలిపింది. రైలు ప్రారంభ స్టేషన్‌ నుంచి చివరి స్టేషన్‌ వరకూ రద్దు అయితే.. వెంటనే టికెట్‌ పీఎన్‌ఆర్‌ (ప్యాసింజర్‌ నేమ్‌ రికార్డ్‌) కూడా క్యాన్సిల్‌ అవుతుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రయాణికులు ఏ ఖాతా నుంచి టికెట్‌ను బుక్‌ చేసుకున్నారో దానికే డబ్బులు వాపస్‌ అవుతుందని రైల్వే శాఖ ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపింది. ఇప్పటివరకు రైల్వే అధికారులు ఇచ్చే టికెట్‌ డిపాజిట్‌ రసీదు (టీడీఆర్‌)ను ఆన్‌లైన్‌లో నమోదు చేసుకుని తిరిగి పొందుతున్నాం. ఇక నుంచి అటువంటి పద్ధతికి రైల్వే శాఖ గుడ్‌బై చెప్పింది. కొత్త విధానంతో ఇకపై ఎలాంటి టీడీఆర్‌ను సమర్పించాల్సిన అవసరం ఉండదు.



 


తత్కాల్‌లో ఏసీ టికెట్ల బుకింగ్‌ ప్రయాణానికి ఒక రోజు ముందు 10గంటలకు, నాన్‌ ఏసీ 11గంటలకు ప్రారంభమవుతుందని తెలిపింది రైల్వే శాఖ. పూర్తి వివరాలను ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో చూడాలని ప్రయాణికులకు రైల్వే సూచించింది. ఇక, వ్యాపార ప్రకటనల ద్వారా ఆదాయాన్ని పెంచుకునేందుకు హైస్పీడ్‌ కారిడార్ల వెంట ఫ్యాబ్రికేషన్‌ గోడలు నిర్మించి, వాటిపై ప్రకటనలు ముద్రించేందుకు ప్రణాళికను రూపొందించింది. గోడలను నిర్మించేందుకు ఢిల్లీ-ముంబై హైస్పీడ్‌ కారిడార్‌లో కాంట్రాక్టర్లను కూడా ఆహ్వానించింది.