JEE Mains 2024 Results: జేఈఈ మెయిన్స్ 2024 సెకండ్ సెషన్ ఫలితాలు విడుదల చేసింది ఎన్టీఏ. ఈ ఫలితాల్లో ఏపీ, తెలంగాణకు చెందిన 22 మంది విద్యార్ధులు 100 శాతం స్కోర్ సాధించడం విశేషం. జాతీయ స్థాయిలో కూడా తెలుగు విద్యార్ధులే అత్యధికంగా ఉన్నారు. ఫలితాలను jeemain.nta.ac.in ద్వారా తెలుసుకోవచ్చు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశవ్యాప్తంగా ఐఐటీ, ఎన్ఐటీల్లో అడ్మిషన్లపై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ జేఈఈ మెయిన్స్ పరీక్షను రెండు సెషన్లలో నిర్వహిస్తుంది. ఇందులో ఉత్తీర్ణత చెందితే అడ్వాన్స్ రాయడానికి అర్హులు. జేఈఈ మెయిన్స్ సెషన్ 1 పరీక్షలు జనవరి 2024లో జరగగా అందులో 23 మంది విద్యార్ధులు 100 శాతం స్కోరు సాధించారు. ఏప్రిల్ నెలలో జరిగిన రెండవ సెషన్‌లో ఏకంగా 33 మంది విద్యార్ధులు 100 శాతం స్కోరు సాధించారు. దేశవ్యాప్తంగా మొత్తం 56 మంది విద్యార్ధులు 100 శాతం మార్కులు సాధించారు. 


దేశవ్యాప్దంగా 100 శాతం పర్సెంటైల్ సాధించిన విద్యార్ధుల్లో జనరల్ కేటగరీ విద్యార్ధులు 40 మంది కాగా ఓపీసీ విద్యార్ధులు 10 మంది, ఈడబ్ల్యూఎస్ కేటగరీ నుంచి 6 మంది ఉన్నారు. ఎస్సీ, ఎస్టీ కేటగరీ విద్యార్ధులు 100 శాతం సాధించలేదు. పరీక్షల సమయంలో అనుచిత మార్గాలు ఉపయోగిస్తూ పట్టుబజడటంతో 39 మంది విద్యార్ధుల్ని మూడేళ్లపాటు జేఈఈ మెయిన్స్ రాయకుండా నిషేధించినట్టు ఎన్టీఏ తెలిపింది. ఈసారి దేశవ్యాప్తంగా 14.1 లక్షలమంది పరీక్షలు రాశారు. వీరిలో 96 శాతం మంది అర్హత సాధించారు. 


జేఈఈ మెయిన్స్ 2024 సెషన్ 2లో 100 శాతం సాధించిన తెలుగు విద్యార్ధులు


హందేకర్ విదిత్, ముత్తవరపు అనూప్, వెంకటసాయి తేజ మద్దినేని, రెడ్డి అనిల్, రోహన్ సాయిబాబా, మోహన్ కల్లూరి, కేసం చెన్న బసవరెడ్డి, మురికినాటి సాయి దివ్య తేజ రెడ్డి, రిషి శేఖర్ శుక్లా, తవ్వ దినేశ్ రెడ్డి, గంగ శ్రేయస్, పొలిశెట్టి రితీష్ బాలాజీ, తమటం జయదేవ్ రెడ్డి, మావూరు జస్విత్, దొరిసాల శ్రీనివాసరెడ్డి, చింటు సతీష్ కుమార్, షేర్ సూరజ్, మకినేని జిష్ణు సాయి, తోటంశెట్టి నిఖిలేష్, అన్నరెడ్డి వెంకట తనీష్ రెడ్డి, తోట సాయి కార్తీక్, మురసాని సాయి యశ్వంత్ రెడ్డి


జేఈఈ మెయిన్స్ 2024 సెషన్ 2 ఫలితాలను jeemain.nta.ac.in ద్వారా తెలుసుకోవచ్చు. ఇందులో కటాఫ్ సాధించిన వివిధ కేటగరీల విద్యార్ధులు మొత్తం 2.50 లక్షలమంది జేఈఈ అడ్వాన్స్ పరీక్ష రాయవచ్చు. జేఈఈ అడ్వాన్స్ 2024 పరీక్షకు ఏప్రిల్ 27 నుంచి మే 7 వరకూ దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. మే 17 నుంచి 26 వరకూ అడ్మిట్ కార్డుల విడుదల ఉంటుంది.  ఆ తరువాత అడ్వాన్స్ పరీక్ష మే 26వ తేదీన ఉదయం 9 గంటల్నించి మద్యాహ్నం 12 గంటల వరకూ తిరిగి మద్యాహ్నం 2.30 గంట్లనించి సాయంత్రం 5.30 గంటలవరకూ ఉంటుంది. జేఈఈ అడ్వాస్స్ 2024 పరీక్ష ఫలితాలు జూన్ 9 న ఉంటాయి.


Also read: Loksabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో ఇవాళే నామినేషన్లకు ఆఖరి తేదీ, రేపు రెండో విడత పోలింగ్



 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook