NTPC recruitment 2022: ఇండియన్ థర్మల్​ పవర్​ కార్పొరేషన్ (ఎన్​టీపీసీ) ఉద్యోగ అవకాశాలు ప్రకటించింది. వివిధ ఎగ్జిక్యూటివ్ విభాగాల్లో ట్రైనీలకోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. సంస్థ అధికారిక వెబ్​సైట్ ద్వారా దరఖాస్తులు పంపొచ్చని వివరించింది ఎన్​టీపీసీ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ ఉద్యోగాలకు అర్హులు ఎవరు? దరఖాస్తులకు చివరి తేదీ ఎప్పుడు? అనే వివరాలు ఇప్పుడు పరిశీలిద్దాం.


ఖాళీల వివరాలు ఇలా..


  • ఎగ్జిక్యూటివ్ ట్రైనీ-ఫినాన్స్ (సీఏ/సీఎంఏ) 20 పోస్టులు

  • ఎగ్జిక్యూటివ్​ ట్రైనీ ఫినాన్స్ (ఎంబీఏ ఫినాన్స్) 10 పోస్టులు

  • ఎగ్జిక్యూటివ్​ ట్రైనీ హెచ్​ఆర్​- 30 పోస్టులు


శాలరీ ఎంత?


ఈ ఉద్యోగాలన్నింటికి రూ.40 వేల నుంచి రూ.1.4 లక్షల వరకు వేతనం ఉండనుంది (ఈ1 గ్రేడ్​ క్యాటగిరీ వారికి).


అప్లయ్​ చేయడం ఎలా?


  • ముందుగా ఎన్​టీపీసీ అధికారిక వెబ్​సైట్ (ntpc.co.in)లోకి లాగిన్ అవ్వాలి

  • హోం పేజీలో కెరీర్​ లింక్​పై క్లిక్ చేయాలి

  • అందులో ఏ పోస్ట్​కు దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్నారో.. దానిని సెలెక్ట్​ చేసుకోవాలి.

  • అప్లికేషన్ ఫారంలో అడిగిన వివరాలన్నీ సమర్పించి.. సబ్మిట్​పై క్లిక్ చేయాలి.

  • దరఖాస్తు ఫారంను పీడీఎఫ్​ను సేవ్​ చేసుకుని.. ప్రింటౌట్​ కూడా తీసుకోవాలి. భవిష్యత్ అవసరాలకు అది అవసరమవుతుంది.


వయో పరిమితి ఎంత?


2021 మార్చి 21నాటికి 29 ఏళ్లు దాటి ఉండకూడదు. రిజర్వేషన్ల ప్రకారం వయోపరిమితి మినహాయింపులకోసం ఎన్​టీపీసీ వెబ్​సైట్​లో నోటిఫికేషన్​ను పూర్తిగా చదవాలి.


Also read: Jayalalitha Death Mystery: అంత అస్వస్థతగా ఉంటే..ఎవరు నిర్లక్ష్యం చేశారు


Also read: Exit Polls 2022: ఐదు రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్ ఏం చెబుతున్నాయి, ఏ రాష్ట్రంలో ఎవరిది పైచేయి, యోగీ, కేజ్రీల క్రేజ్ పెరిగిందా


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook