భారత రక్షణ రంగంలో మరో విజయం
ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి అగ్ని-5 ప్రయోగం విజయవంతమైంది.
ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి అగ్ని-5 ప్రయోగం విజయవంతమైంది. ఒడిశా తీరంలోని అబ్దుల్‌కలాం దీవి నుంచి ప్రయోగించిన అగ్ని-5 క్షిపణి ప్రయోగం విజయవంతమైందని రక్షణశాఖ వెల్లడించింది.
ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్(ఐటీఆర్) లాంచ్ ప్యాడ్-4 నుంచి మొబైల్ లాంచర్ సాయంతో ఆదివారం ఉదయం 9:48గంటలకు అగ్ని-5 క్షిపణిని ప్రయోగించినట్లు, ఇది నిర్దేశించిన దూరాన్ని ఛేదించినట్లు అధికారులు తెలిపారు. ప్రయోగాన్ని రాడార్లు, ట్రాకింగ్ వ్యవస్థలతో పరిశీలించామని, అగ్ని-5 క్షిపణి నిర్ణీత దూరం చేరుకున్నట్లు అధికారులు వెల్లడించారు. కాగా అణ్వస్త్రాలను మోసుకెళ్ళే సామర్థ్యం ఉన్న అగ్ని-5 క్షిపణి.. ఉపరితలం నుంచి 5వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించే సామర్థ్యాన్ని కలిగి ఉంది. కాగ ఇపప్తివరకు అగ్ని-5 క్షిపణి పరీక్షలను భారత్ చేపట్టడం ఇది ఆరోసారి.