Kolkata court has declared that Nikhil Jain and Nusrat Jahan's wedding is invalid: తృణమూల్​ కాంగ్రెస్ ఎంపీ, బెంగాలీ నటి నుస్రత్ జహాన్​, వ్యాపారి నిఖిల్​ జైన్​ల పెళ్లి చట్టబద్ధంగా చెల్లదని కోల్​కతా (Kolkata court says Nusrat Jahan's weding is invalid ) కోర్టు బుధవారం తెల్చి చెప్పింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వీరి వివాహం టర్కీలో జరగటం సహా.. ఇద్దరు మతాలు వేరు కావడం వల్ల.. దేశీయంగా ప్రత్యేక పెళ్లి చట్టం కింద రిజిస్ట్రర్ కాలేదని స్పష్టం చేసింది. ఈ కారణంగానే వారి వివాహ బంధం చట్టబద్దం (Nusrat Jahan's wedding with Nikhil Jain) కాదని తెలిపింది.


ఈ ఏడాది ఆరంభంలో తాము విడిపోతున్నట్లు నుస్రత్​, నిఖిల్​ ప్రకటించారు. ఈ నేపథ్యంలో తమ వివాహం చెల్లుబాటు కాదని కోర్టును ఆశ్రయించారు నిఖిల్​.


Also read: చెన్నైకు పొంచి ఉన్న మరో జల ప్రళయం, ఇవాళ్టి నుంచి అతి భారీ వర్షాల హెచ్చరిక


Also read: కర్ణాటక రాజకీయాల్లో బిట్ కాయిన్ కుంభకోణం ప్రకంపనలు, ఆ ఇద్దరు మంత్రులే కారణమా


2019లో పెళ్లి..


కొన్నాళ్లు డేటింగ్ చేసిన తర్వాత 2019 జూన్ 19న వ్యాపార వేత్త నిఖిల్ జైన్​ను టర్కీలోని ఓ వెడుకలో పెళ్లి చేసుకున్నారు నుస్రత్ జహాన్​.


టర్కీష్ చట్ట ప్రకారం వీరుద్దరు ఒక్కటయ్యారు. వ్యక్తిగత విభేదాల కారణంగా కొన్నాళ్లకే వీరి బంధానికి ముగింపు పలికారు.


నిఖిల్​ జైన్​తో విడిపోయే సమయంలో పలు ఆరోపణలు చేశారు నుస్రత్​​. తన కుటుంబ ఆభరణాలు, ఇతర ఆస్తులను ఆయన​ దోచుకున్నారని ఆరోపించారు. తనకు తెలియకుండానే వివిధ ఖాతాల్లోని డబ్బును తీసుకున్నారని చెప్పారు. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. 


ప్రెగ్నెన్సీపై నిఖిల్ ప్రకటన..


నుస్రత్ జహాన్​ ప్రెగ్నెన్సీకి సంబంధించిన ఫొటోలు నెట్టింట చక్కర్లు కొట్టగా.. వాటిపై నిఖిల్ జైన్ స్పంపదించారు. తనకు అమె ప్రగ్రెన్సీతో సంబంధం లేదని ప్రకటించారు.


నిఖిల్ గురించి..


ఇంగ్లాండ్​లోని యూనివర్సిటీ ఆఫ్ వార్విక్​లో మేనేజ్​మెంట్ కోర్సును పూర్తి చేసిన తర్వాత యూకేకు చెందిన ఎంఎన్​సీలో (Who is Nikhil Jhain) పనిచేశారు. అనంతరం టెక్స్​టైల్ వ్యాపారంలోకి అడుగుపెట్టారు.


Also read: పాక్ ఆక్రమిత కశ్మీర్ ఖాళీ చేయాల్సిందే, ఇండియా వార్నింగ్


మగబిడ్డకు జన్మనిచ్చిన నుస్రత్..


ఇదిలా ఉండగా.. నుస్రత్ ఈ ఏడాది ఆగస్టు 26 పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. అయితే నిఖిల్​తో విడిపోయాకా.. అమె తన స్నేహితుడు, నటుడు, బీజేపీ నేత యశ్ దాస్​గుప్తకు దగ్గరైనట్లు అప్పట్లో వార్తలొచ్చాయి. ఆ బిడ్డకు తండ్రికూడా అతడేనని ఆ వార్తల సారాంశం.


దీనిపై నుస్రత్ అధికారికంగా ప్రకటించనప్పటికీ.. తర్వాత అదే నిజమని తేలింది. నుస్రత్ బిడ్డకు సంబంధించిన బర్త్ సర్టిఫికేట్ ఆధారంగా ఈ విషయం బయటపడింది. అందులో నుస్రత్​ కుమారుడి పేరు ఇషాన్​గా పేర్కొన్నారు.


యశ్​ దాస్​ గుప్తా అసలు పేరు దేబాషిస్​ దాస్​ గుప్తా. ఆయన ఇటీవల బెంగాల్​ అసెంబ్లీ​ ఎన్నికల్లో హుగ్లీ జిల్లా నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు.


Also read: వేరే కులస్తుడిని పెళ్లి చేసుకుందని కూతురిపై తండ్రి అత్యాచారం


Also read: గాంధీ, నేతాజీ మధ్య సంబంధంపై సుభాష్‌ చంద్రబోస్‌ కూతురు అనితా బోస్‌ స్పందన


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook