వేరే కులస్తుడిని పెళ్లి చేసుకుందని కూతురిపై తండ్రి అత్యాచారం

Madhya Pradesh man rapes daughter: ఈ మధ్య... దీపావళికి తన అక్క ఇంటికి వెళ్లింది. అయితే అక్కడ ఆమె కొడుకు అనారోగ్యంతో మృతి చెందాడు. దీంతో ఆమె అక్క తన తండ్రిని సంప్రదించి సహాయం కోరింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 17, 2021, 07:42 PM IST
  • ప్రేమ పెళ్లి చేసుకుందని కూతురిపై దారుణానికి పాల్పడ్డ తండ్రి
  • కన్న కూతురిపైనే అత్యాచారానికి పాల్పడ్డ దుర్మార్గుడు
  • గొంతు నులిమి చంపేసిన కర్కశుడు
వేరే కులస్తుడిని పెళ్లి చేసుకుందని కూతురిపై తండ్రి అత్యాచారం

Madhya Pradesh man rapes daughter, who married outside caste, then kills her: కూతురు.. తన మాటను ఎదురించిందని... ప్రేమ పెళ్లి చేసుకుందని.. మనసులో పెట్టుకున్న ఓ తండ్రి దారుణానికి పాల్పడ్డాడు. కన్న కూతురిపైనే (daughter) అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమె గొంతు నులిమి చంపేశాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో జరిగింది. రెండు రోజుల క్రితం మధ్యప్రదేశ్ (Madhya Pradesh) రాజధాని భోపాల్‌లోని సంస్‌గఢ్ అడవుల్లో ఓ మహిళ, ఎనిమిది నెలల శిశువు మృతదేహం లభ్యమైంది. ఈ ఘటనపై కేసు పోలీసులు దర్యాప్తు కొనసాగించారు. అయితే ఆ మృతదేహాలు (Dead bodies) సెహోర్ జిల్లాలోని బిల్కిస్‌గంజ్‌లో నివసిస్తున్న మహిళ, ఆమె ఎనిమిది నెలల కొడుకుదని తేలింది. దీన్ని ఆధారంగా పోలీసులు కేసు విచారణ చేపట్టారు. దీంతో పలు షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. కన్న కూతురిపైనే తండ్రి అత్యాచారం చేసి గొంతు నులిమి హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. 

కూతురు తమను కాదని పెళ్లి చేసుకోవడంతో సమాజంలో కుటుంబ పరువు పోయిందని, అది భరించలేకే కూతురిని హత్య (Murder) చేసినట్లు తండ్రి పోలీసుల (police) ఎదుట ఒప్పుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భోపాల్‌లోని రాతిబాద్‌కు చెందిన 55 ఏళ్ల వ్యక్తి కూతురు.. ఏడాది క్రితం లవ్ మ్యారేజ్ (Love marriage) చేసుకుంది. ఈ విషయం ఆమె తండ్రికి అస్సలు నచ్చలేదు.

Also Read :IND Vs NZ 1st T20* : న్యూజిలాండ్  Vs ఇండియా  ఫస్ట్ టీ 20 LIVE SCORE UPDATES*

అంతేకాదు పెళ్లి చేసుకున్న తర్వాత కూతురితో తండ్రికి రోజూ గొడవలు జరిగేవి. ఇలా రోజూ తన ఇంటికి వచ్చి లేదంటే ఫోన్లో తండ్రి గొడవపడడంతో.. పెళ్లైనప్పటి నుంచి కూతురు కూడా తల్లిదండ్రుల ఇంటికి వెళ్లలేదు. ఈ మధ్య... దీపావళికి (Diwali) తన అక్క ఇంటికి వెళ్లింది. అయితే అక్కడ ఆమె కొడుకు అనారోగ్యంతో (Illness) మృతి చెందాడు. దీంతో ఆమె అక్క తన తండ్రిని సంప్రదించి సహాయం కోరింది.

సమాచారం అందుకున్న తండ్రి తన కుమారుడితో కలిసి చనిపోయిన శిశువుకు అంత్యక్రియలు నిర్వహిస్తామని నమ్మబలికాడు. తమతో పాటు అటవీ ప్రాంతానికి రావాల్సిందిగా కూతురిని కోరాడు. దీంతో ఆమె తన తండ్రితో కలిసి అడవికి వెళ్లింది. ఈ క్రమంలో తండ్రి (Father) కూతురిపై దాడి చేసి.. ఆమెపై అత్యాచారం (Rape) చేశాడు. తర్వాత గొంతు నులిమి చంపేశాడు (Murder).

Also Read :ఆరోగ్యం కోసం ఆవు పేడ తింటున్న డాక్టర్ వీడియో వైరల్.. నెటిజెన్స్ ఏమంటున్నారంటే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook 

Trending News