చెన్నైకు పొంచి ఉన్న మరో జల ప్రళయం, ఇవాళ్టి నుంచి అతి భారీ వర్షాల హెచ్చరిక

తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైను మరోసారి భారీ వర్షాలు వణికించనున్నాయి. రానున్న రెండ్రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాల హెచ్చరిక జారీ అయింది. ఫలితంగా చెన్నైలో రెడ్ అలర్ట్ ప్రకటించారు.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Nov 18, 2021, 09:52 AM IST
  • చెన్నై సహా ఆరు జిల్లాల్లో అతి భారీ వర్షాల హెచ్చరిక
  • చెన్నైలో 20 సెంటీమీటర్ల కంటే భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం
  • వార్‌రూమ్ ఏర్పాటు, స్కూళ్లకు సెలవులు
 చెన్నైకు పొంచి ఉన్న మరో జల ప్రళయం, ఇవాళ్టి నుంచి అతి భారీ వర్షాల హెచ్చరిక

తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైను మరోసారి భారీ వర్షాలు వణికించనున్నాయి. రానున్న రెండ్రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాల హెచ్చరిక జారీ అయింది. ఫలితంగా చెన్నైలో రెడ్ అలర్ట్ ప్రకటించారు.

చెన్నై నగరాన్ని వరుణుడు వెంటాడుతున్నాడు. గత కొద్దిరోజులుగా భారీ వర్షాలతో(Heavy Rains), అల్పపీడన ప్రభావంతో గజగజ వణికిపోతున్న చెన్నై మరోసారి ముప్పు ఎదుర్కోనుంది. తమిళనాడు రాజధాని చెన్నైతో పాటు పొరుగు జిల్లాలైన చెంగల్పట్టు, కాంచీపురం, తిరువళ్లూరు జిల్లాలకు భారీ వర్ష సూచన జారీ చేశారు చెన్నై వాతావరణ శాఖ అధికారులు. ఫలితంగా రెడ్ అలర్ట్ ప్రకటించడమే కాకుండా ఆ నాలుగు జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు ఇచ్చారు.

చెన్నైతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో గత కొన్ని రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా రాజధాని వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఇవాళ అంటే నవంబర్ 18వ తేదీన చెన్నై సమీపంలో తీరందాటే అవకాశం ఉంది. ఫలితంగా చెన్నై, సమీప జిల్లాల ప్రజలకు(Heavy Rains Alert in Chennai) వాతావరణ శాఖ హెచ్చరికలు జారీచేసింది. ఇవాళ్టి నుంచి భారీ నుంచి అతిభారీ వర్షాలు కురవనుండటంతో చెన్నైకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్‌పట్టు, కడలూరులో అతిభారీ వర్షాలు కురుస్తాయని, విళ్లుపురం జిల్లాలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు.

ఇక చెన్నైలో అయితే 20 సెంటీమీట్ల కంటే ఎక్కువగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని చెప్పారు. దీంతో అధికారులను(IMD)ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించేందుకు వీలుగా చెన్నై కార్పొరేషన్‌లో వార్‌‌రూమ్‌ ఏర్పాటైంది. పరిస్థితిని సమీక్షిస్తూ అవసరమైన సహాయాన్ని తక్షణం అందించనున్నారు. 

Also read: పాక్ ఆక్రమిత కశ్మీర్ ఖాళీ చేయాల్సిందే, ఇండియా వార్నింగ్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News