Porn Video Played At Patna railway Station: మీరు ఏదైనా రైల్వే స్టేషన్ కు మీ కుటుంబ సభ్యులతో వెళ్లిన సమయంలో అక్కడ ప్రకటనలు, రైల్వే అనౌన్స్మెంట్లు వచ్చే టీవీలో పోర్న్ ఫిలిం ప్లే అయితే ఎలా ఉంటుంది. ఊహించుకోవడానికే చాలా ఇబ్బంది కరంగా ఉంది కదా. అయితే ఈ దారుణమైన ఘటన నిజంగానే జరిగింది. బీహార్‌ రాజధాని పాట్నా జంక్షన్‌లో ప్లాట్‌ఫారమ్ నంబర్ 10పై అమర్చిన టీవీ స్క్రీన్‌పై పోర్న్ ఫిల్మ్ ప్లే అయిన సంఘటన వెలుగులోకి వచ్చింది. 10వ నెంబర్ ప్లాట్‌ఫారమ్ మీద రైలు కోసం పెద్ద సంఖ్యలో ప్రయాణికులు వేచి ఉన్న సమయంలో ఈ ఘటన జరిగింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అందుతున్న సమాచారం ప్రకారం, రైల్వే ప్లాట్‌ఫారమ్‌పై అమర్చిన టీవీ సెట్‌లో ఈ పోర్న్ ఫిల్మ్ సుమారు 3 నిమిషాల పాటు ప్లే అయింది. అయితే ఈ విషయం తెలుసుకున్న రైల్వే స్టేషన్ సిబ్బంది వెంటనే ఈ వీడియోను నిలిపివేశారు. అలాగే సంబంధిత అధికారులు విచారణ ప్రారంభించారు. అంతే కాదు ఈ మొత్తం వ్యవహారం మీద ఎఫ్‌ఐఆర్ కూడా నమోదైంది. ఈ టీవీ స్క్రీన్‌పై సమాచారాన్ని అందించడం, వీడియోలను చూపించడం కోసం దత్తా కమ్యూనికేషన్ ఏజెన్సీ కాంట్రాక్ట్ తీసుకుంది.


ఈ వీడియోను ఈ కంపెనీ తరపునే ప్లే అయిందని ప్రాథమిక విచారణలో తేలింది. ఈ దత్తా కమ్యూనికేషన్ ఏజెన్సీ సిబ్బంది పని చేయాల్సిన సమయంలో పోర్న్ క్లిప్‌లు చూస్తున్నారు. ఈ క్రమంలోనే అదే అసభ్యకరమైన క్లిప్ ఈ టీవీ స్క్రీన్‌పై ప్లే చేయబడిందని గుర్తించారు. పాట్నా జంక్షన్‌లోని టీవీ సెట్‌లో ఈ వీడియో ప్లే కావడంతో, ఇక్కడ కూర్చున్న ప్రయాణికులు షాక్ అయ్యారు.


వారికి ఏమి చేయాలో అర్థం కాలేదు? ఇంతలో పాట్నా జంక్షన్‌లోని సంబంధిత అధికారులు ఈ విషయం తెలుసుకున్న వెంటనే, వారు ఆర్‌పిఎఫ్ సహా జిఆర్‌పి ద్వారా ఈ వీడియోను నిలిపివేశారు. వెంటనే సంబంధిత ఏజెన్సీకి ఫోన్ చేసి ఈ విషయమై సమాచారం తీసుకున్నారు. ఈ విషయాన్ని ఆర్పీఎఫ్ స్వయంగా దానాపూర్ రైల్వే డివిజన్ అధికారులకు తెలియజేయగా సంబంధిత దత్తా కమ్యూనికేషన్‌పై చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు.



ఈ దత్తా కమ్యూనికేషన్ ఏజెన్సీ ఆపరేటర్, సంబంధిత సిబ్బందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయబడింది. ప్రస్తుత సమాచారం ప్రకారం, కేవలం ప్లాట్‌ఫాం 10లోని టీవీ సెట్‌లలో మాత్రమే అశ్లీల క్లిప్ ప్లే చేయబడింది. అయితే, ఇది నిర్లక్ష్యానికి సంబంధించిన అంశం అనే చెప్పాలి. ఎందుకంటే రైల్వే స్టేషన్ అంటే అన్ని వయసుల వారు, వృద్ధులు, పిల్లలు, మహిళలు తిరుగాడే ప్రదేశం, అలాంటి చోట ఇలాంటి ఘటన జరగడం చాలా దారుణామైన అంశం. ప్లాట్‌ఫారమ్ నంబర్ 10లో ఉదయం 9.56 గంటల నుంచి రాత్రి 9.59 గంటల వరకు కేవలం మూడు నిమిషాల పాటు మాత్రమే అశ్లీల చిత్రాలు ప్రదర్శించారని అధికారులు చెబుతున్నారు.
Also Read: Niharika Konidela Disturbances: నిహారిక, చైతన్య జొన్నలగడ్డ మధ్య విభేదాలు.. అందుకే ఫోటోలు డిలీట్‌?


Also Read: Keerthy Suresh Gold Coins: బంగారు కీర్తి.. ఏకంగా 130 మందికి గోల్డ్ కాయిన్స్ పంపిణీ!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి  TwitterFacebook