Niharika Konidela Disturbances: నిహారిక, చైతన్య జొన్నలగడ్డ మధ్య విభేదాలు.. అందుకే ఫోటోలు డిలీట్‌?

Niharika Konidela husband unfollows her: నటి తర్వాత కాలంలో నిర్మాతగా మారిన నిహారిక కొన్నేళ్ల క్రితం జొన్నలగడ్డ చైతన్య అనే యువకుడిని వివాహం చేసుకోగా ఇప్పుడు వారి మధ్య పొరపొచ్చాలు వచ్చాయని, అందుకే వారు విడిపోయారు అనే టాక్ వినిపిస్తోంది. 

Written by - Chaganti Bhargav | Last Updated : Mar 19, 2023, 11:31 PM IST
Niharika Konidela Disturbances: నిహారిక, చైతన్య జొన్నలగడ్డ మధ్య విభేదాలు.. అందుకే ఫోటోలు డిలీట్‌?

Niharika Konidela unfollows her husband: మెగా బ్రదర్స్ లో ఒకరైన నాగబాబు కుమార్తె, నటి తర్వాత కాలంలో నిర్మాతగా మారిన నిహారిక కొన్నేళ్ల క్రితం జొన్నలగడ్డ చైతన్య అనే యువకుడిని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరిది పెద్దలు కుదిర్చిన వివాహం కావడంతో రాజస్థాన్లోని ఉదయపూర్ ప్యాలెస్ లో చాలా గ్రాండ్గా జరిపారు. వీరి పెళ్లి జరిగి ఇప్పటికే మూడేళ్లు కావస్తోంది అయితే వీరిద్దరూ విడిపోబోతున్నారు అంటూ పుకార్లు మాత్రం చాలా సార్లు చక్కర్లు కొట్టాయి.

ఇప్పుడు మరోసారి వీరిద్దరూ విడిపోబోతున్నారని వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దాన్ని సూచిస్తూ ఒకరినొకరు సోషల్ మీడియాలో అన్ ఫాలో కూడా చేసుకున్నారు అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. నిజానికి అటు నిహారిక ఇటు చైతన్య జొన్నలగడ్డ ఇద్దరూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. ఇంస్టాగ్రామ్ లో తమ ఫోటోలు అప్లోడ్ చేసేందుకు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అలా యాక్టివ్ గా ఎప్పటికప్పుడు సందడి చేస్తూ ఉండే వారు ఒకరినొకరు ఇన్స్టాగ్రామ్ లో ఇప్పుడు అన్ ఫాలో చేసుకున్నారు అనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

దానికి తగ్గట్టుగానే చైతన్య జొన్నలగడ్డ నిహారికతో వివాహం జరిగినప్పటి ఫోటోలను కూడా తన అకౌంట్ నుంచి డిలీట్ చేశారు. అదేవిధంగా నిహారికతో కలిసి ఉన్న ఫోటో కూడా ఒకటి కూడా లేకుండా ఇన్స్టాగ్రామ్ మొత్తాన్ని క్లీన్ చేశారు. దీంతో ఇప్పుడు సరికొత్త అనుమానాలు తెర మీదకి వస్తున్నాయి. ఇద్దరి మధ్య వివాదం నెలకొందని అందుకే ఇద్దరూ సరిగా మాట్లాడుకోవడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. దీంతో మీరు విడాకులు తీసుకోబోతున్నారు అంటూ కూడా రకరకాల చర్చలు అయితే సోషల్ మీడియాలో జరుగుతున్నాయి.

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే నిహారిక మాత్రం చైతన్య జొన్నలగడ్డతో వివాహం జరిగినప్పటి ఫోటోలను డిలీట్ చేయలేదు. కేవలం జొన్నలగడ్డ చైతన్య మాత్రమే ఆ ఫోటోలను డిలీట్ చేశారు. ఈ వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ వార్తల మీద అటు నిహారిక కానీ ఇటు చైతన్య కానీ స్పందిస్తారా లేదా అనేది చూడాల్సి ఉంది..
Also Read: Nani On Venkatesh Maha: నీచ్ కమిన్ కుత్తే కామెంట్లపై నాని స్పందన.. జడ్జ్ చేయను అంటూ!

Also Read: Keerthy Suresh Gold Coins: బంగారు కీర్తి.. ఏకంగా 130 మందికి గోల్డ్ కాయిన్స్ పంపిణీ!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి  TwitterFacebook

 

 

Trending News