Keerthy Suresh Gold Coins: బంగారు కీర్తి.. ఏకంగా 130 మందికి గోల్డ్ కాయిన్స్ పంపిణీ!

Keerthy Suresh Gold Coin: ఇక విడుదలకు సిద్దమైన దసరా సినిమాలోని టెక్నీషియన్లకు ఒక్కొక్కరికి ఒక్కొక్క బంగారు నాణాన్ని చొప్పున కీర్తి సురేష్ పంపిణీ చేసినట్లుగా తెలుస్తోంది.  

Written by - Chaganti Bhargav | Last Updated : Mar 19, 2023, 08:50 PM IST
Keerthy Suresh Gold Coins: బంగారు కీర్తి.. ఏకంగా 130 మందికి గోల్డ్ కాయిన్స్ పంపిణీ!

Keerthy Suresh Gold Coins to Dasara Team: ఈ మధ్య మన తెలుగు హీరోలు సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత ఆ సినిమా కోసం పనిచేసిన యూనిట్ లోని టెక్నీషియన్లకు ఖరీదైన వాచీలు, ఫోన్లు, బంగారు నాణేలు గిఫ్టులుగా ఇవ్వడం పరిపాటిగా మారింది. ఆర్ఆర్ఆర్ సినిమా కోసం పనిచేసిన యూనిట్ కి కూడా రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్లు ఇలాగే బహుమతులు ఇచ్చారు. అయితే హీరోయిన్లు ఇలాంటి విషయాల్లో కాస్త వెనుకబడి ఉంటారు.

కానీ కీర్తి సురేష్ మాత్రం ఈ విషయంలో ఒక అడుగు ముందుకేసింది. కీర్తి సురేష్ హీరోయిన్ గా నాని హీరోగా దసరా అనే సినిమా రూపొందింది. తెలంగాణలోని గోదావరిఖని సింగరేణి గనుల నేపథ్యంలో తెరకెక్కిన ఈ రా, రస్టిక్ సినిమాలో కీర్తి సురేష్ వెన్నెల అనే పాత్రలో నటించింది. ఇక విడుదలకు సిద్దమైన ఈ సినిమాలోని టెక్నీషియన్లకు ఒక్కొక్కరికి ఒక్కొక్క బంగారు నాణాన్ని చొప్పున కీర్తి సురేష్ పంపిణీ చేసినట్లుగా తెలుస్తోంది. మహానటి సినిమా తర్వాత అలాంటి నటనకు స్కోప్ ఉన్న పాత్ర ఇప్పటికి ఈ సినిమా ద్వారా దక్కిందని కీర్తి సురేష్ ఈ సినిమా ఇంటర్వ్యూలలో పేర్కొంది.

ఈ నేపథ్యంలోనే తనను అలాంటి సినిమాలో భాగమయ్యేలా చేయడమే కాక తన షూటింగ్ పార్ట్ అంతా సాఫీగా సాగేలా చేసిన నేపథ్యంలో అక్కడి టెక్నీషియన్లు అందరికీ ఆమె బంగారు నాణాలు గిఫ్టుగా ఇచ్చినట్లుగా తెలుస్తోంది. కచ్చితంగా ఈ సినిమాతో హిట్టు కొడతానని కీర్తి సురేష్ నమ్మకంగా చెబుతోంది. మార్చి 30వ తేదీన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.

తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమాని ఏకకాలంలో విడుదల చేస్తున్నారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ మీద సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాని సుకుమార్ శిష్యుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించాడు. మొత్తం మీద సినిమా యూనిట్ కి కీర్తి సురేష్ బంగారు నాణేలు ఇచ్చిన అంశం టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతోంది.
Also Read: Nani On Venkatesh Maha: నీచ్ కమిన్ కుత్తే కామెంట్లపై నాని స్పందన.. జడ్జ్ చేయను అంటూ!

Also Read: Vijayashanthi Serious: 'రానా నాయుడు'పై విజయశాంతి సీరియస్..ప్రజలు ఇచ్చిన అభిమానాన్ని నిలబెట్టుకోవాలి అంటూ!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి  TwitterFacebook

 

Trending News