Odisha Train Accident Update: ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. దశాబ్దకాలంలో అత్యంత భారీ ప్రమాదంగా భావిస్తున్న ఈ రైళ్ల ప్రమాద ఘటనలో ఇప్పటి వరకూ 233 మంది మరణించారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మూడు రైళ్లు..ఏకకాలంలో ఒకదానికొకటి గుద్దుకుని చెల్లాచెదురయ్యాయి. భోగీలు ఒకదానిపై మరొకటి ఎక్కి..తీవ్రంగా ధ్వంసమయ్యాయి. కొన్ని భోగీలు పల్టీలు కొట్టి దొర్లిపోయాయి. కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ వర్సెస్ గూడ్స్ రైలు వర్సెస్ యశ్వంత్ పూర్ ఎక్స్‌ప్రెస్ ప్రమాద ఘటన ఇది. నిన్న సాయంత్రం 6.55 గంటలకు ఒడిశాలోని బహానగ బజార్ రైల్వే స్టేషన్ సమీపంలో ఆగి ఉన్న గూడ్స్ రైలును ట్రైన్ నెంబర్ 12841 షాలిమార్-చెన్నై కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ బలంగా ఢీ కొట్టింది. దాంతో దాదాపు 7-8 కోచ్‌లు పట్టాలు తప్పి చెల్లాచెదురయ్యాయి. ఈలోగా పక్క ట్రాక్‌పై వస్తున్న ట్రైన్ నెంబర్ 12864 ఎస్ఎంవిబీ-హోరా సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ఈ భోగీల్ని కొట్టుకుంటూ వెళ్లి..పట్టాలు తప్పింది. 


233కు చేరుకున్న మృతుల సంఖ్య, మరింత పెరిగే అవకాశం


వెరసి ఈ ప్రాంతమంతా అత్యంత భయంకరంగా మారింది. ప్రమాద ఘటనలో సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. భోగీల నుంచి మృతదేహాల వెలికితీత కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకూ ఈ ప్రమాదంలో 233 మంది మరణించారు.1000 మంది వరకూ గాయపడ్డారు. క్షతగాత్రుల్ని బాలేశ్వర్, భద్రక్, మయూర్ భంజ్, కటక్ ఆసుపత్రులకు తరలించారు. కొందరు క్షతగాత్రుల పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఎంత మరణించి ఉండవచ్చనేది కచ్చితంగా తెలియడం లేదు. బాధితుల్లో బెంగాలీ వాసులు ఎక్కువగా ఉన్నట్టు సమాచారం. 


Also read: Odisha Train Accident: ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం.. కంటతడి పెట్టిస్తున్న దృశ్యాలు..


రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. మరోవైపు ఒడిశా రైలు ప్రమాదంపై హైలెవెల్ కమిటీ నియమించారు. ప్రస్తుతం సహాయక చర్యలపై దృష్టి కేంద్రీకరించామని..బాధితులకు మెరుగైన వైద్యం అందిస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు.


Also read: Odisha Train Accident: ఒడిశా ఘోర రైలు ప్రమాదం, దశాబ్దకాలంలో ఇదే అతిపెద్దది, గత పదేళ్లలో జరిగిన రైలు ప్రమాదాలివే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook