Odisha Train Accident: ఒడిశా ఘోర రైలు ప్రమాదం, దశాబ్దకాలంలో ఇదే అతిపెద్దది, గత పదేళ్లలో జరిగిన రైలు ప్రమాదాలివే

Odisha Train Accident: ఒకటి కాదు, రెండు కాదు..ఏకకాలంలో మూడు రైళ్లు ఒకదానికొకటి క్రాష్ అయి జరిగిన అత్యంత ఘోర ప్రమాదం. రెండు పాసెంజర్ రైళ్లు కాగా మరొకటి గూడ్స్ రైలు. గత దశాబ్దకాలంలో ఇదే అతిపెద్ద ప్రమాదంగా తెలుస్తోంది. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jun 3, 2023, 08:35 AM IST
Odisha Train Accident: ఒడిశా ఘోర రైలు ప్రమాదం, దశాబ్దకాలంలో ఇదే అతిపెద్దది, గత పదేళ్లలో జరిగిన రైలు ప్రమాదాలివే

Odisha Train Accident: ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతూ పోతోంది. ఇప్పటి వరకూ 233 మంది ప్రాణాలు కోల్పోయారు. వందల కొద్దీ ప్రయాణీకులు గాయాలతో అల్లాడుతున్నారు. మూడు రైళ్లు ఒకదానికొకటి ఢీ కొన్న అతి ఘోరమైన ప్రమాదమిది. గత పదేళ్లలో ఇదే అతిపెద్ద ప్రమాదంగా తెలుస్తోంది. 

ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదం గతంలో ఎక్కడా ఈ తరహాలో జరగలేదు. అత్యంత వేగంగా ప్రయాణించే ఓ ప్యాసెంజర్ రైలు ఆగి ఉన్న గూడ్స్ రైలును బలంగా ఢీ కొన్ని పట్టాలు తప్పి చెల్లాచెదురైంది. అంతలో పక్క ట్రాక్ నుంచి వస్తున్న మరో ప్యాసెంజర్ రైలు బోల్తాపడిన రైలును ఢీ కొట్టింది. ఫలితంగా ప్రమాద తీవ్రత భారీగా పెరిగిపోయింది. గూడ్స్ రైలును షాలిమార్-చెన్నై కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ఢీ కొట్టగా, బోల్తాపడిన కోరమాండల్ రైలును బెంగళూరు-హౌరా సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెష్ ఢీ కొట్టింది. ఫలితంగా ఇప్పటి వరకూ 233 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 700 వందల మందికి గాయాలయ్యాయి. మృతుల సంఖ్య మరింత పెరగవచ్చని తెలుస్తోంది. ఈ క్రమంలో గత పదేళ్లలో ఇదే అతిపెద్ద ప్రమాదంగా భావిస్తున్నారు. గత దశాబ్దకాలంలో జరిగిన పెద్ద రైలు ప్రమాదాల వివరాలు ఇలా..

2022వ వ సంవత్సరం జనవరి 13వ తేదీన పశ్చిమ బెంగాల్ అలీపూర్  దువార్‌లో బికనీర్-గౌహతి ఎక్స్‌ప్రెస్ 12 కోచ్‌లు పట్టాలు తప్పగా 9 మంది మరణించారు. 36 మంది గాయాలపాలయ్యారు. 

2017వ సంవత్సరం ఆగస్టు 18వ తేదీన పూరి-హరిద్వార్ ఉత్కల్ ఎక్స్‌ప్రెస్ ముజఫర్ నగర్‌లో పట్టాలు తప్పడంతో 23 మంది మరణించారు. మరో 60 మందికి గాయాలయ్యాయి.

2017 ఆగస్టు 23వ తేదీన ఢిల్లీ కైపియత్ ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పడంతో 80 మందికి గాయాలయ్యాయి. 

2016 నవంబర్ 20వ తేదీన ఇండోర్-పాట్నా ఎక్స్‌ప్రెస్ రైలు కాన్పూర్ సమీపంలో పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో 150 మంది మరణించారు. నిన్నటి వరకూ ఇదే అతిపెద్ద ప్రమాదం. మరో 200 మంది గాయాలపాలయ్యారు. 

2014 మే 26వ తేదీన ఉత్తరప్రదేశ్ సంత్‌కబీర్ నగర్ ప్రాంతంలో గోరఖ్‌పూర్ వెళ్తున్న గోరఖ్ థామ్ ఎక్స్‌ప్రెస్ ఖలీలాబాద్ స్టేషన్ సమీపంలో ఆగి ఉన్న గూడ్స్ రైలును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో 25 మంది మరణించారు.

2012వ సంవత్సరం మే 22వ తేదీన ఆంధ్రప్రదేశ్‌లో గూడ్స్ రైలు, హుబ్లీ-బెంగళూరు హంపి ఎక్స్‌ప్రెస్ ఢీకొన్నాయి. మంటలు చెలరేగడంతో 25 మంది మృత్యువాత పడగా 43 మంది ప్రయాణీకులు గాయపడ్డారు. గత పదేళ్ల కాలంలో జరిగిన రైలు ప్రమాదాల్లో ఇదే అతి పెద్దది. ఒడిశా రైలు ప్రమాద ఘటనలో ఇప్పటి వరకూ 233 మంది మరణించారు. మృతుల సంఖ్య ఇంకా పెరగవచ్చని తెలుస్తోంది. 

Also read: Railway Jobs 2023: రైల్వేలో భారీగా ఉద్యోగాలు, ఇవాళే ఆఖరు తేదీ, వెంటనే అప్లై చేయండి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News