Odisha Train Accident: ఒడిశా రైలు ప్రమాదం ప్రతిరోజూ ఎన్నో ప్రశ్నలు సంధిస్తోంది. అత్యంత ఘోరమైన ఈ రైలు ప్రమాదంలో 278 మంది ప్రాణాలు కోల్పోగా, 1100 మందికి గాయాలయ్యాయి. ఇందులో 100 మంది పరిస్థితి విషమంగా ఉంది. ఇంతటి పెను విషాదాన్ని మిగిల్చిన రైలు ప్రమాదానికి నిర్లక్ష్యమే పూర్తి కారణమని తెలుస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఒడిశా రైలు ప్రమాదంల సిగ్నలింగ్ వ్యవస్థ లోపం వల్ల జరిగిందని రైల్వైశాఖ ప్రాధమికంగా నిర్ణయించింది. హౌరా వైపుకు వెళ్తున్న కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌ను మెయిన్ లైన్‌లోకి వెళ్లేలా స్విచ్ కదిపినా పనిచేయకపోవడం వల్ల కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ డ్రైవర్‌కు లూప్ లైన్ గ్రీన్ సిగ్నల్ కన్పించింది. దాంతో 120 కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తున్న కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ఒక్కసారిగా లూప్ లైన్‌లోకి మారడం, ఆ ట్రాక్‌పై ఆగి ఉన్న గూడ్స్ రైలును ఢీ కొట్టి పట్టాలు తప్పడమే కాకుండా భోగీలు గాలిలో లేచి ధ్వంసమయ్యాయి. అదే సమయంలో పక్క ట్రాక్‌పై దూసుకొస్తున్న యశ్వంత్ పూర్ ఎక్స్‌ప్రెస్ చివరి భోగీలను కోరమాండల్ రైలు భోగీలు ఢీ కొట్టాయి. దాంతో ఆ రైలు కూడా పట్టాలు తప్పింది. 


అయితే ఇప్పుడు ఈ ప్రమాదం నేపధ్యంలో రైల్వే వ్యవస్థలోని భద్రతపై పలు ప్రశ్నలు వస్తున్నాయి. సరిగ్గా మూడు నెలల క్రితం ఓ రైల్వే అధికారి ఇలాంటి ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకుని చేసిన హెచ్చరికల్ని రైల్వే శాఖ పెడచెవిన పెట్టిందని తెలుస్తోంది. ఇంటర్ లాకింగ్ లోపాల్ని సరిచేయకపోతే తీవ్ర ప్రమాదం జరగవచ్చని ఓ లేఖ ద్వారా అప్పట్లో ఆయన వివరించారు. ఇప్పుడీ లేఖ వైరల్ అవుతోంది. 


యూపీలోని లక్నోలో విధులు నిర్వహిస్తున్నత హరిశంకర్ వర్మ అనే అధికారి మూడు నెలల క్రితం రైల్వే శాఖ ఉన్నతాధికారులకు ఓ లేఖ రాశారు. తృటిలో తప్పిన ఓ ప్రమాదం గురించి ప్రస్తావించారు. ఇండియన్ రైల్వే ఇనిస్టిట్యూట్ ఆఫ్ ట్రాన్స్‌పోర్ట్ మేనేజ్‌మెంట్ డైరెక్టర్ జనరల్ హరిశంకర్ వర్మ మూడేళ్లుగా సౌత్ వెస్ట్రన్ రైల్వేలో పనిచేస్తున్నారు. అప్పట్లో ప్రిన్సిపల్ ఛీఫ్ ఆపరేషనల్ మేనేజర్‌గా ఉన్న సమయంలో కొన్ని రైళ్లు ట్రాక్ మళ్లిన సందర్భాలు చూశారు. ప్రారంభంలో అయితే స్టేషన్ మేనేజర్‌ను బాధ్యత వహించేలా చేసేవారు. కానీ ఈ తరహా ఘటనలు తరచూ జరగడంతో స్వయంగా పరిశీలించారు. ఫిబ్రవరి 8వ తేదీన అంటే మూడు నెలల క్రితం బెంగళూరు-న్యూ ఢిల్లీ సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ మెయిన్ లైన్ సిగ్నల్ ఇచ్చినా రైలు మాత్రం లూప్ లైన్‌లోకి వెళ్లింది. అయితే లోకో పైలట్ అప్రమత్తం కావడంతో రైలు నిలిపివేశాడు. లేదంటే అప్పుడే ఇప్పుడు జరిగిన ప్రమాదం వంటిది జరిగేది.


Also read: Track Restored: రైలు ప్రమాదం జరిగిన 51 గంటల్లో ట్రాక్ పునరుద్ధరణ, ప్రారంభమైన రైళ్ల రాకపోకలు


ఇదంతా సిగ్నలింగ్ వ్యవస్థలో ఇంటర్ లాకింగ్ కోసం రూపొందించిన యంత్రాంగంలో లోపాల వల్ల జరిగిందని ఆయన నిర్ధారించారు. వెంటనే ఇంటల్ లాకింగ్ నిలిపివేయాలని రైల్వేకు లేఖ రాశారు. లైన్ బైపాస్ చేసేటప్పుడు లొకేషన్ బాక్స్‌లో సమస్య ఏర్పడుతుందని తెలిపారు. అయితే అప్పట్లో రైల్వే శాఖ ఈ లేఖను విస్మరించింది. ఏ విధమైన చర్యలు తీసుకోలేదు. నాడు ఈ లేఖపై చర్యలు తీసుకుని ఉంటే ఇప్పుడీ పరిస్థితి తలెత్తేది కాదనే వాదన విన్పిస్తోంది.


Also read: Odisha Train Accident: ఒడిశా ప్రమాదంలో పెరిగిన మృతుల సంఖ్య, ఆ 101 మృతదేహాలు ఎవరివి


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook