Odisha Train Accident: ఒడిశాలోని బహానగ బజార్ రైల్వే స్టేషన్ వద్ద జరిగిన ఘోర రైలు ప్రమాదంలో మరణాల సంఖ్య పెరుగుతోంది. తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమంగా ఉన్నవారు ఒక్కొక్కరిగా ప్రాణాలు విడుస్తున్నారు. 1100 మంది ప్రయాణీకులు ఈ ఘటనలో గాయపడగా 100 మంది పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది.
కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ వర్సెస్ గూడ్స్ రైలు వర్సెస్ యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఒకదానికొకటి ఢీ కొన్న సంఘటనలో ఏకంగా 278 మంది మరణించగా 11 వందల మంది గాయాలపాలయ్యారు. వీరిలో 100 మంది పరిస్థితి విషమంగా ఉందని కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్వయంగా వెల్లడించారు. వాస్తవానికి మృతుల సంఖ్య 275 అని రైల్వే శాఖ అధికారికంగా ప్రకటించింది. అయితే క్షతగాత్రుల్లో విషమంగా ఉన్నవారిలో ముగ్గురు ప్రాణాలు విడిచారు. దాంతో మృతుల సంఖ్య 278 కు చేరుకుంది. తొలుత మరణించినవారి సంఖ్య 288గా అంచనా వేశారు. అయితే ఆ తరువాత 275గా నిర్ధారించారు.
ఇప్పటి వరకూ మరణించిన 278లో 177 మంది మృతదేహాలను గుర్తించగా ఇంకా 101 మందిని గుర్తించాల్సి ఉంది. అనిర్ధారిత మృతదేహాలను 6 వేర్వేరు ఆసుపత్రుల్లో ఉంచారు. 11 మంది గాయాలపాలు కాగా 200 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మరోవైపు ఒడిశా, పశ్చిమ బెంగాల్, జార్ఘండ్, ఛత్తీస్‌గఢ్, బీహార్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో గల్లంతైన వ్యక్తుల సమాచారం గుర్తించేందుకు రైల్వే సిబ్బందిని ప్రత్యేకంగా నియమించారు.
కాగా ఈ ఘటన వెనుక కుట్రకోణం ఉందనే అనుమానాల నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం సీబీఐ దర్యాప్తుకు ఆదేశించింది. 10 మంది సభ్యుల ప్రత్యేక బృందం ఇప్పటికే ఘటనా స్థలాన్ని సందర్శించి దర్యాప్తు ప్రారంభించింది. దర్యాప్తు ప్రక్రియలో భాగంగా ఒడిసా పోలీసులు జూన్ 3వ తేదీన రిజిస్టర్ చేసిన కేస్ నెంబర్ 64ను సీబీఐ హ్యాండోవర్ చేసుకుంది.
ఈ కేసు ఐపీసీ సెక్షన్లు 37, 38 ర్యాష్ అండ్ నెగ్లిజెన్సీతో గాయపర్చడం, ప్రాణాలు పోయేందుకు కారణం కావడం, నిర్లక్ష్యం కారణంగా ప్రాణాలు పోవడం సెక్షన్ 304ఏ, సెక్షన్ 153 చట్ట విరుద్ధం, నిర్లక్ష్య పూరిత చర్యతో రైల్వే ప్రయాణీకుల ప్రాణాలు పోవడం ఇలా వివిధ సెక్షన్ల ప్రకారం కేసు నమోదైంది.
మరోవైపు ఒడిశా రైలు ప్రమాదం ప్రమాదం జరిగిన 51 గంటల తరువాత ట్రాక్ పునరుద్ధరణ పనులు పూర్తి చేసి రైళ్ల రాకపోకలకు మార్గం సుగమం చేశారు. అయితే తొలి దశలో కేవలం డీజిల్ రైళ్ల రాకపోకలకే అనుమతిచ్చారు. ఎందుకంటే ఎలక్ట్రిక్ కేబుల్ పనులు ఇంకా పూర్తి కాలేదు. ఈ పనులు పూర్తయ్యేందుకు మరో 2 రోజులు సమయం పట్టవచ్చు.
Also read: Track Restored: రైలు ప్రమాదం జరిగిన 51 గంటల్లో ట్రాక్ పునరుద్ధరణ, ప్రారంభమైన రైళ్ల రాకపోకలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook