OLA For Oxygen: ఇండియా కరోనా మహమ్మారి దెబ్బకు ప్రజలు అల్లాడిపోతున్నారు. ఆక్సిజన్ అందక ప్రాణాలు గాలిలో కల్సిపోతున్నాయి. ఈ క్రమంలో ప్రముఖ రైడింగ్ యాప్ ఓలా సరికొత్త సదుపాయన్ని కల్పిస్తోంది. బాధితుల్ని ఆదుకుంటోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశంలో కరోనా సెకండ్ వేవ్ (Corona Second Wave) మహోధృతంగా వ్యాపిస్తోంది. ప్రతిరోజూ భారీ సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. ఆక్సిజన్, బెడ్స్, అత్యవసర మందుల కొరత తీవ్రమవుతోంది. ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు కూడా లభించడం లేదు.ఇప్పటికే వైద్యానికి సంబంధించిన సామగ్రిని, ఆక్సిజన్‌ను విదేశాలు ఇండియాకు సహాయంగా అందిస్తున్నాయి. ఈ తరుణంలో ప్రముఖ రైడింగ్ యాప్ ఓలా సరికొత్త సదుపాయాన్ని ప్రవేశపెట్టి..బాధితుల్ని ఆదుకునే ప్రయత్న చేస్తోంది. 


దేశంలో కరోనా కేసులు భారీగా పెరగడం, ఆక్సిజన్ అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపధ్యంలో ఆక్సిజన్ కాన్సంట్రేటర్లకు (Oxygen Concentrators) డిమాండ్ పెరిగింది. అందుకే ఓలా సంస్థ తన యూజర్లకు ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను ఉచితంగా అందించడానికి ముందుకొచ్చింది. కరోనా బాధితులైన ఓలా యూజర్లు తమ కనీస వివరాల్ని యాప్‌లో నింపాల్సి ఉంటుంది. తరువాత అవసరమైన వారి ఇంటి ముందుకే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు ఉచితంగా అందించేలా ఏర్పాట్లు చేసింది. ఈ కార్యక్రమాన్ని గివ్ ఇండియా భాగస్వామ్యంతో ఓలా ఫౌండేషన్(Ola Foundation) చేయనుంది. ఆక్సిజన్ కాన్సంట్రేటర్లకు, రవాణా ఛార్జీల కింద ఓలా యూజర్ల నుంచి ఎలాంటి రుసుము వసూలు చేయదు. తొలిదశలో 5 వందల ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను బెంగళూరు నగరంలో ప్రారంభించబోతోంది.రానున్న రోజుల్లో పదివేల వరకూ మెషీన్లను దేశవ్యాప్తంగా అందేలా చేయనున్నామని ఓలా(OLA) సహ వ్యవస్థాపకుడు భవీష్ అగర్వాల్ తెలిపారు. అసాధారణ పరిస్థితుల్లో దేశ ప్రజలకు సహాయం అందించేందుకు ఆక్సిజన్ ఫర్ ఇండియా కార్యక్రమాన్ని చేపట్టామని చెప్పారు. 


Also read: Fake SMS alert: కొవిడ్-19 వ్యాక్సిన్ ఫ్రీ రిజిస్ట్రేషన్ పేరిట Cyber frauds


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook