భారత చీఫ్ ఎలక్షన్ కమిషనర్(సీఈసీ)గా ఓం ప్రకాష్ రావత్ బాధ్యతలు చేపట్టారు. మధ్యప్రదేశ్ మాజీ ఐఏఎస్ కేడర్ కు చెందిన రావత్ రాష్ట్ర, దేశ స్థాయిలో వివిధ హోదాల్లో సేవలు అందించారు. రక్షణ, భారీ పరిశ్రమల శాఖలతో పాటు ఆయన 2004-2006 వరకు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రికి ప్రిన్సిపాల్ సెక్రటరీగా వ్యవహరించారు.   


సీఈసీగా అచల్ కుమార్ జోతి పదవీకాలం సోమవారం ముగియడంతో.. ఆయన స్థానంలో ఓం ప్రకాష్ రావత్ నియమితులయ్యారు. ముగ్గురు సభ్యుల ఎన్నికల కమిషన్ నుంచి సీఈసీగా రావత్ పదోన్నతి పొందటంతో ఆయన స్థానంలో కమిషనర్ గా ఆర్ధికమంత్రిత్వ శాఖ మాజీ కార్యదర్శి అశోక్ లవాసా నియమితులయ్యారు.