India Omicron Update: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఢిల్లీలో అత్యధికంగా 238 కేసులు నమోదు కాగా, రెండు, మూడు స్థానాల్లో మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలు నిలిచాయి. అటు తెలంగాణ, కేరళలో అయితే..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ సంక్రమణ వేగం పుంజుకుంది. ప్రతి రోజూ కొత్త కేసులు పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తోంది. దేశంలో ఇప్పటి వరకూ 781 ఒమిక్రాన్ కేసులు నమోదు కాగా, 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కూడా పరిస్థితి కలవరం రేపుతోంది. ఢిల్లీలో (Delhi Omicron Update)అత్యధికంగా 238 ఒమిక్రాన్ కేసులు నమోదైతే..167 కేసులతో మహారాష్ట్ర రెండవ స్థానంలోనూ, 73 కేసులతో గుజరాత్ మూడవ స్థానంలో, 65 కేసులతో కేరళ నాలుగవ స్థానంలో, 62 కేసులతో తెలంగాణ 5వ స్థానంలో నిలిచాయి. తాజాగా గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 9 వేల 195 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకూ దేశవ్యాప్తంగా 3 కోట్ల 48 లక్షల 8 వేల 886 మంది కోవిడ్ బారిన పడ్డారు. మరోవైపు కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య దేశవ్యాప్తంగా 77 వేలకు చేరుకుంది. 


ఇక కోవిడ్ కారణంగా దేశంలో మరణించివారి సంఖ్య 4 లక్షల 80 వేల 592కు చేరుకోగా, తాజాగా 302 మంది మరణించారు. కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య మార్చ్ నుంచి అత్యల్పంగా 0.22 శాతానికి పరిమితమైంది. కోవిడ్ రికవరీ రేటు జాతీయ స్థాయిలో 98.40 శాతముంది. మార్చ్ 2020 అంటే కోవిడ్ మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి ఇదే అత్యధికం. కేవలం 24 గంటల వ్యవధిలో 1546 కేసులు పెరిగాయి. రోజువారీ పాజిటివిటీ రేటు 0.79 శాతంగా నమోదైంది. గత 86 రోజులతో పోలిస్తే ఇది రెండు శాతం తక్కువ. ఇక వీక్లీ పాజిటివిటీ రేటు 0.68 శాతంగా ఉంది. గత 45 రోజులతో పోలిస్తే ఇది 1 శాతం తక్కువ.


ఒమిక్రాన్ (Omicron)కేసుల సంక్రమణ దేశంలో ఎంతవేగంగా ఉందనేది రోజురోజుకూ పెరుగుతున్న కేసుల్ని బట్టి అంచనా వేయవచ్చు. తెలంగాణలో ప్రతిరోజూ 10-12 కొత్త కేసులు నమోదవుతున్నాయి. అటు ఢిల్లీలో రోజురోజుకీ పరిస్థితి విషమిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపధ్యంలో ఇప్పటికే చాలా రాష్ట్రాలు నైట్ కర్ప్యూ విధిస్తున్నాయి.


Also read: Omicron Risk: ఒమిక్రాన్ ముప్పు ఎక్కువే, ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిక


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook