Gas Leak in Erode: రసాయన పరిశ్రమలో లీకైన విషవాయువు...ఒకరు మృతి, 13 మంది పరిస్థితి విషమం..
Tamil Nadu: రసాయన పరిశ్రమలో విషవాయువు లీకై...ఒకరు మృతి చెందగా...మరో 13 మంది పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన తమిళనాడులోని ఈరోడ్‌లో చోటుచేసుకుంది.
gas leak in Erode: తమిళనాడులోని ఈరోడ్‌లో ఉన్న రసాయన పరిశ్రమ(chemical factory)లో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో క్లోరిన్ వాయువు(liquid chlorine) లీకై ఒకరు మృతి చెందారు. మరో 13 మంది పరిస్థితి విషమంగా ఉంది.
పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం...చిటోడే(Chithode) ప్రాంతంలో దామోదరన్ అనే వ్యక్తి ఓ లిక్విడ్ క్లోరిన్ ఫ్యాక్టరీని నిర్వహిస్తున్నారు. అయితే ఓ సిలిండర్‌లో క్లోరిన్(chlorine) వాయువును నింపుతుండగా.. ప్రమాదవశాత్తు గ్యాస్ లీకై దామోదరన్ అక్కడికక్కడే మృతి చెందాడు. అదే ఫ్యాక్టరీలో పనిచేస్తున్న 20మంది కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. అందులో 13 మంది స్పృహ కోల్పోయారు.
Also Read: Two Farmers Killed : నిరసన ప్రాంతం నుంచి ఇంటికి తిరిగొస్తుండగా ఇద్దరు రైతుల మృతి
వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు.. బాధితులను ఆస్పత్రికి తీసుకెళ్లారు. సరైన సమయంలో ఆస్పత్రికి తీసుకురావడం వల్ల ప్రాణాపాయం తప్పినట్లు వైద్యులు వెల్లడించారు. ప్రమాదంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. గత ఏడాది మేలో ఏపీ(Andhra Pradesh)లోని విశాఖపట్నం(Visakhapatnam)లో ఇటువంటి ఘటనే చోటుచేసుకుంది. స్టైరిన్ గ్యాస్ లీకై..12 మంది మరణించారు. 588 మంది అస్వస్థతకు గురయ్యారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook