Union Cabinet: ఎన్డీయే ప్రభుత్వం ఎన్నికలపై సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న జమిలి ఎన్నికలకు కేంద్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేయడంతో త్వరలోనే ఏకకాలంలో ఎన్నికలు జరిగే ఆస్కారం ఉంది. పార్లమెంటు నుంచి పంచాయతీ వరకు అన్ని ఎన్నికలనూ ఒకేసారి నిర్వహించడంపై మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నేతృత్వంలో రూపొందించిన నివేదికకు కేంద్రం ఆమోదం తెలపడంతో ఇప్పుడు దేశవ్యాప్తంగా దీనిపైనే చర్చ జరుగుతోంది. శీసుకమార్‌తాకాల సమావేశాల్లోనే జమిలి బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టి ఆమోదించుకోవాలనే పట్టుదలతో ఎన్డీయే సర్కార్‌ ఉండడంతో తీవ్ర ఉత్కంఠ ఏర్పడింది. అయితే దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలను నిర్వహించడంతో ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి.. దీని వలన దేశానికి జరిగే ప్రయోజనం ఏమిటి? అనే సందేహాలు ఉన్నాయి.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: One Election: మోదీ ప్రభుత్వం సంచలనం.. జమిలి ఎన్నికలకు ఆమోదం


రాజకీయంగా.. అభివృద్ధిపరంగా పరిణామాలు ఎలా ఉంటాయనేది చర్చనీయాంశంగా మారాయి. ఈ పరిస్థితుల్లో జమిలి ఎన్నికలపై ప్రయోజనాలు.. నష్టాలు అనేవి ఉన్నాయి. అభివృద్ధిపరంగా చూస్తే కొంత దేశానికి మేలు చేసేలా ఉండగా.. రాజకీయపరంగా కొన్ని పార్టీలకు అనుకూలం.. మరికొన్ని పార్టీలకు నష్టం చేసేలా పరిస్థితులు ఉన్నాయి. ఈ దశలో జమిలి ఎన్నికలు వస్తే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటో తెలుసుకుందాం.

Also Read: Jamili Elections: జమిలి ఎన్నికలకు ఏ రాజ్యాంగ సవరణలు అవసరం, దేశంలో ఎప్పుడైనా జమిలి జరిగిందా


జమిలి ఎన్నికలతో లాభాలు


  • దేశంలో సార్వత్రిక ఎన్నికలు, వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి లేవు. దీనికితోడు స్థానిక సంస్థలు అవో పెద్ద ప్రహసనం. తరచూ వచ్చే ఎన్నికలతో అభివృద్ధి కార్యక్రమాలకు ఆటంకం ఏర్పడుతోంది. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు జరిగితే కోడ్‌ అనే ఇబ్బంది ఉండదు. ఎన్నికలు ఒకేసారి ముగిస్తే ప్రభుత్వాలు అభివృద్ధి, సంక్షేమంపై దృష్టి సారిస్తాయి.

  • తరచూ జరిగే ఎన్నికలతో భారీగా ఖర్చవుతోంది. మానవ వనరుల వినియోగం.. నిర్వహణ భారంగా ఉన్నాయి. జమిలి ఎన్నికలు అమలు చేస్తే ఈ కష్టాలు అనేవి ఉండవు.

  • జమిలి ఎన్నికలతో ఓటర్లకు బాధ్యత పెరుగుతుంది. ఒకేసారి జరిగే ఎన్నికలతో భారీగా ఓటింగ్‌ శాతం పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

  • ఒకేసారి ఎన్నికల నిర్వహణతో ఓటు వేయడానికి ప్రజలు తరుచూ వేరే ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదు.


నష్టాలు


  • అత్యధిక జనాభా కలిగిన మనదేశంలో ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం చాలా కష్టం. భారీ స్థాయిలో పోలింగ్‌ జరగడం అంటే ఆషామాషీ కాదు

  • ఒకేసారి ఎన్నికలు జరిపితే పారదర్శకతపై అనుమానాలు కలగవచ్చు.

  • జమిలి ఎన్నికలపై రాజ్యాంగంలో ఎలాంటి ప్రస్తావన లేదు. దీంతో ఒకేసారి ఎన్నికలు జరిపితే రాజ్యాంగ విరుద్ధంగా పరిగణించే ఆస్కారం ఉంది.

  • ప్రభుత్వాలు నిర్దేశిత గడువులోపు పడిపోతే.. లేదంటే రాజ్యాంగ సంక్షోభం ఏర్పడితే జమిలి ఎన్నికల లక్ష్యం దెబ్బతింటుంది. అవిశ్వాసం ఎదుర్కొనే ప్రభుత్వాల విషయంలో కూడా జమిలి ఎన్నికల ప్రయోజనం నెరవేరదు.

  • జమిలి ఎన్నికలతో జాతీయ పార్టీలకు ప్రయోజనం ఉంటుంది. ప్రాంతీయ పార్టీలకు ప్రతికూలంగా మారే ప్రమాదం ఉంది. జాతీయ అంశాల ఆధారంగా అసెంబ్లీకి కూడా ప్రజలు ఓటేస్తే ప్రాంతీయ పార్టీలు ఎన్నికల్లో దెబ్బతినే ప్రమాదం ఉంది.

  • జమిలి ఎన్నికల నిర్వహణకు భారీగా సిబ్బంది, ఈవీఎంలు, వీవీ ప్యాట్లు అవసరం. అవన్నీ ఒకేసారి ఏర్పాటుచేయడం చాలా ఇబ్బందికరం.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.