రైల్లో ప్రయాణిస్తున్నప్పుడు ఎవరికైనా.. ఎప్పుడైనా ఏదైనా అనారోగ్య సమస్య తలెత్తవచ్చు. అలాగే రైలు ప్రయాణం ముగించుకొని ఇంటికి వెళ్తున్నప్పుడు కూడా ఏదైనా ప్రమాదం జరిగినా లేదా అనారోగ్యం బారిన పడినా డాక్టర్ వద్దకు వెళ్లి ట్రీట్ మెంట్ చేయించుకోవాలంటే ఎలా? సమయానికి ఆ స్టేషను దగ్గర డాక్టర్ దొరుకుతాడా లేదా అన్న ప్రశ్నలు కూడా తలెత్తవచ్చు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఒకవేళ అలాంటి సమయంలో ట్రీట్‌మెంట్ చేయించుకున్నా ఎంత బిల్లు వేస్తారన్న విషయంలో కూడ మీమాంస ఎదురుకావచ్చు. అయితే ఈ ప్రశ్నలన్నింటికీ జవాబు ఇస్తూ.. ప్రయాణికుల భద్రతకు, ఆరోగ్యానికి పెద్దపీట వేస్తామని చెబుతోంది సెంట్రల్ రైల్వే. అందుకోసమే ఓ పథకంతో ముందుకు వచ్చింది. ఆ పథకంలో భాగంగానే "మ్యాజిక్ డిల్" అనే ఆరోగ్య సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది.


ఈ ఒప్పందంలో భాగంగా సెంట్రల్ రైల్వే పరిధిలోకి వచ్చే స్టేషన్లలో "మ్యాజిక్ డిల్" ఆరోగ్య ఔట్‌లెట్లు ఏర్పాటు చేయడానికి సంకల్పించింది. ఆ మినీ ఆసుపత్రుల్లో రోగి నుండి కేవలం రూ.1 మాత్రమే కన్సల్టేషన్ ఫీజుగా తీసుకుంటారు. ఇవి మినీ ఆసుపత్రులన్న మాట. ఆ ఆరోగ్య ఔట్‌లెట్లలో పేషెంటుకి ట్రీట్‌మెంట్ చేయడానికి ఓ డాక్టరు, కాంపౌండర్, నర్సు కూడా ఎప్పుడూ అందుబాటులోనే ఉంటారు. రైల్వే ట్రాక్ల మీద


యాక్సిడెంట్లు జరుగుతున్నప్పుడు తక్షణ వైద్య సహాయం అందించడం కోసం రైల్వే శాఖ ఎలాంటి పథకం కూడా ఎందుకు తీసుకురాలేదని ఓ ఆర్టీఐ యాక్టివిస్టు కోర్టులో వేసిన పిల్ మేరకు బొంబాయి హైకోర్టు తీర్పు ఇస్తూ.. సెంట్రల్ రైల్వే పరిధిలోకి వచ్చే రైల్వేస్టేషన్లలో ఎమర్జెన్సీ ఆరోగ్య ఔట్‌లెట్లు ఏర్పాటు చేయమని తెలిపింది. ఆ తీర్పు మేరకు సెంట్రల్ రైల్వే ఈ మినీ ఆసుపత్రుల పథకానికి నాంది పలికింది.