Zomato Medicine Service: జొమాటో ఇప్పుడు కరోనా సేవలందించేందుకు సిద్ధమవుతోంది. దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతుండటంతో వినియోగదారుల కోసం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా ఉధృతి సమయంలో సరికొత్త నిర్ణయం అమలు చేస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జొమాటో..స్విగ్గీ. ప్రముఖ ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ(Online Food Delivery)సంస్థలు. కోరుకున్న ఆహారాన్ని, కోరుకున్న హోటల్ నుంచి క్షణాల్లో మీ ముందు ఉంచే సంస్థలు. దేశవ్యాప్తంగా కరోనా ఉధృతంగా ఉన్న సమయంలో జొమాటో (Zomato) కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా రోగులకు సేవలందించేందుకు సిద్ధమైంది. కస్టమర్ల కోసం సంచలనం నిర్ణయం తీసుకుంది. దేశంలో ముందుగా నోయిడా నుంచి ఈ సేవల్ని ప్రారంభించింది. 


కరోనా కేసులు (Corona virus) రోజురోజుకూ పెరుగుతుండటంతో పరిస్థితి భయంకరంగా మారుతోంది. దేశంలో కరోనా అత్యధికంగా ఢిల్లీలో వ్యాప్తి చెందుతోంది. వందలాదిమంది చనిపోతున్నారు. కరోనా రోగులందర్నీ ఆసుపత్రుల్లో ఉంచి వైద్యం అందించే పరిస్థితి లేదు. అంతకుమించి ఆసుపత్రుల్లో సౌకర్యాలు కూడా లేని పరిస్థితి. అందుకే చాలామంది హోమ్ ఐసోలేషన్‌( Home Isolation)తో చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్రమంలో కావల్సిన మందులు తెచ్చుకోవడంలో రోగులు ఇబ్బంది పాలవుతున్నారు. అందుకే ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో రోగులకు అవసరమైన మందుల్ని సరఫరా చేసేందుకు ముందుకొచ్చింది. ముందుగా నోయిడా నుంచి మెడిసిన్ డెలివరీ సర్వీసు ( Zomato Medicine Delivery Service) ప్రారంభించింది. స్థానిక అధికారుల సహాయంతో జొమాటో ఈ సదుపాయం అందుబాటులోకి తెచ్చింది.


మందుల డెలివరీ అందుకున్న ఫోటోల్ని జొమాటో సీఈఓ షేర్ చేశారు. ప్రస్తుతానికి జొమాటో యాప్‌( Zomato App)లో శారీరకంగా బలం కోసం ఉపయోగించే మందులు, విటమిన్ ట్యాబ్లెట్లు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతానికి నోయిడాలో ప్రారంభమైన ఈ మెడిసిన్ డెలివరీ సర్వీసును త్వరలో దేశవ్యాప్తంగా అమలు చేయనున్నారు. 


Also read: Covid Village: ఆ గ్రామంలో 28 మంది మృతి, మొత్తం గ్రామాన్ని సీజ్ చేసిన అధికారులు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook