Covid Village: ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 28 మంది మృత్యువాత పడ్డారు. కారణమేంటనేది తెలియలేదు కానీ కోవిడ్ సంక్రమణ భయంతో మొత్తం గ్రామాన్ని అధికారులు సీజ్ చేశారు.
దేశంలో కరోనా సెకండ్ వేవ్ (Corona Second Wave) అతి భయంకరంగా విస్తరిస్తోంది. దేశంలో కరోనా పరిస్థితులు దారుణంగా మారాయి. ఎక్కడ ఏం జరిగినా కోవిడ్ భయం వెంటాడుతోంది. జ్వరం వంటి లక్షణాలతో మరణాలు సంభవిస్తే..మొత్తం ప్రాంతంలో భయాందోళనలు వ్యాపిస్తున్నాయి. హర్యానా( Haryana) లోని టిటోలి గ్రామంలో అదే జరిగింది. ఈ గ్రామంలో ఇటీవల 28 మంది మరణించారు. అందరివీ అనుమానాస్పద మరణాలే. దాంతో ఒక్కసారిగా భయం నెలకొంది. ఈ గ్రామం హర్యానాలోని రోహ్‌తక్ జిల్లా ( Rohtak District) పరిధిలోనిది. ఇందులో ఇద్దరు యువకులున్నారు. ఈ ఇద్దరూ మరణించడానికి రెండ్రోజుల ముందు జ్వరం వచ్చినట్టు తెలుస్తోంది. దాంతో గ్రామస్థులు ఆందోళన చెందారు. కోవిడ్ వల్లనే అంతా మరణించినట్టు అధికారులు కూడా అంచనాకు వచ్చారు. అందుకే మొత్తం గ్రామాన్ని సీజ్ చేశారు. కోవిడ్ సంక్రమణ భయంతో కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటించి..ఎవర్నీ గ్రామంలోకి అనుమతించడం లేదు. గ్రామస్థుల్ని బయటకు వెళ్లనివ్వడం లేదు. గ్రామ సరిహద్దుల్లో పోలీసుల్ని మొహరించారు.
ఇరుగు పొరుగు గ్రామాల్లో కోవిడ్ వ్యాధి (Covid Spread) వ్యాప్తి చెందకుండా ఉండేందుకే ఈ చర్యలు తీసుకున్నట్టు అధికారులు తెలిపారు. నిన్న 30 మందికి పరీక్షలు చేయగా..21 మందికి పాజిటివ్‌గా తేలింది. మొత్తం గ్రామంలో 25 శాతం మందికి కోవిడ్ సోకినట్టు అధికారులు వెల్లడించారు. గ్రామమంతా కోవిడ్ బారిన పడటంతో ఈ ప్రాంతంలో కలకలం రేగుతోంది.
Also read: Tamilnadu: తమిళనాడు ముఖ్యమంత్రిగా స్టాలిన్ ప్రమాణ స్వీకారం రేపే, 34 మందితో మంత్రివర్గం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook